Namrata: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన నమ్రత…

Namrata

Namrata

మార్చ్ 8న మహిళా దినోత్సవం సందర్భంగా నమ్రత శిరోద్కర్ ఘట్టమనేని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్వీకరించి మొక్కలు నాటింది. బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నమ్రతని పాల్గొనాలని కోరుతూ నామినేట్ చేశారు. ఈ ఛాలెంజ్ ని స్వీకరించిన నమ్రత… తనను గ్రీన్ ఇండియా చాలెంజ్‌కు నామినేట్ చేసినందుకు ఎంపీ సంతోష్ కుమార్‌ కి ధన్యవాదాలు తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు అందరూ మొక్కలు నాటాలని కోరుతూ ఒక వీడియోను కూడా నమ్రత షేర్ చేసింది.

Read Also: Vaathi: ‘సార్’ వంద కోట్లు కొట్టాడు…