Allu Arjun : అల్లు అర్జున్‌కు రెగ్యులర్ బెయిల్.. పుష్పరాజ్ సేఫ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట లో రేవతి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడు శ్రీతేజ్ ఇప్పటికీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయంలో డిసెంబరు 13న చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారించారు. వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ విధించగా అనంతరం అల్లు అర్జున్ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. మరోవైపు తనపై చిక్కడపల్లి పోలీసులు పెట్టిన కేసును కొట్టివేయాలంటూ అల్లు అర్జున్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయగా దీనిపై విచారించిన హైకోర్టు గత నెల 30 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
Also Read : BSS : ‘బెల్లంబాబు’ బర్త్ డే.. 4 సినిమాల స్పెషల్ అప్డేట్స్
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
మధ్యంతర బెయిల్ ముగియడంతో సంధ్య థియేటర్ ఘటన పై నమోదైన కేసులో అల్లు అర్జున్ బెయిల్ పై ఉత్కంఠ నెలకొంది. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై ఇప్పటికే పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. అల్లు అర్జున్ తరపు వాదనలు వినిపించారు న్యాయవాదులు. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ కొట్టి వేయాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కోరింది. మొత్తం మీద ఇరు వాదనలు విన్న న్యాయస్థానం ఉత్కంఠ తెరదించుతూ నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ ఉత్తర్వులు జారీ చేస్తూ తీర్పు వెలువడిస్తూ ప్రతి ఆదివారము చిక్కడపల్లి పోలీసుల ముందు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ ఆదేశాలు చేస్తూ, రూ. 50 వేల రూపాయల రెండు షూరిటీలు సమర్పించాలని, సాక్షులను ప్రభావితం చేయకూడదని,కేసును ప్రభావితం చేసే విధంగా బహిరంగంగా మాట్లాడవద్దని కీలక సూచనలు చేసింది న్యాయస్థానం.
తాజావార్తలు
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!