“మహాసముద్రం” ఫస్ట్ సాంగ్… రంభకు మాస్ ట్రిబ్యూట్

యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం “మహా సముద్రం”. మేకర్స్ ఈ సినిమాలోని మొదటి సింగిల్ ‘హే రంభ రంభ’ను రిలీజ్ చేశారు. ఒకప్పటి స్టార్ హీరోయిన్ రంభకు ప్రత్యేకంగా అంకితమిస్తూ ఈ సాంగ్ ను తెరకెక్కించినట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. రంభ పేరుతోనే రూపొందిన ఈ మాస్ సాంగ్ ఈ ఏడాది మాస్ నంబర్లలో ఒకటిగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది వైజాగ్ బీచ్‌లో విలాసవంతమైన సెట్‌లో చిత్రీకరించబడింది. ఈ పాటలో శర్వానంద్, జగపతి బాబు డ్యాన్స్ చేయడం మనం వీడియోలో చూడవచ్చు. “మహా సముద్రం”కు సంగీతం అందించిన చైతన్ భరద్వాజ్ ఈ ఫుట్-ట్యాపింగ్ ఐటమ్ నంబర్‌ ను కంపోజ్ చేశాడు. భాస్కరభట్ల సాహిత్యం అందించారు.

Read Also : డ్రగ్ కేసు : దీపికా మేనేజర్ కు బెయిల్ నిరాకరణ

ఇక “మహా సముద్రం” థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. శర్వానంద్, జగపతి బాబులతో పాటు ఈ చిత్రంలో సిద్ధార్థ్, అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రొడక్షన్ హౌస్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

-Advertisement-"మహాసముద్రం" ఫస్ట్ సాంగ్... రంభకు మాస్ ట్రిబ్యూట్

Related Articles

Latest Articles