అలుపెరుగని అబ్బాయి… నాగశౌర్య!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏ రంగంలో రాణించాలన్నా కృషిని మించిన సూత్రం లేదు. అయితే చిత్రసీమలో మాత్రం కృషి కంటే అదృష్టం ముఖ్యం అంటూ ఉంటారు. గుమ్మడి కాయంత ప్రతిభ కన్నా ఆవగింజంత అదృష్టం ఉంటేనే చిత్రసీమలో రాణించగలమని చెబుతారు సినీపెద్దలు. నవయువ కథానాయకుడు నాగశౌర్యలో ప్రతిభ ఎంతో ఉంది. ఇప్పటికే డజనుకు పైగా చిత్రాలలో నటించేశాడు. కొన్ని అలరించాయి. మరికొన్ని జనాన్ని పులకింప చేయలేకపోయాయి. దాంతో స్టార్ డమ్ కోసమై నాగశౌర్య ఇంకా శ్రమిస్తూనే ఉన్నాడని చెప్పాలి. అతను ఎంతగా కృషి చేస్తున్నాడో ‘లక్ష్య’ చిత్రం చూస్తే తెలుస్తుంది.
నాగశౌర్య 1989 జనవరి 22న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జన్మించాడు. విజయవాడలో నాగశౌర్య బాల్యం గడిచింది. అప్పటి నుంచీ సినిమాలు అతణ్ణి ఆకర్షిస్తూనే ఉన్నాయి. టెన్నిస్ లో మంచి ప్రావీణ్యం ఉంది. మిత్రులు ఎప్పుడూ హీరోలా ఉన్నావ్ అంటూ ఉండేవారు. దాంతో సినిమాల్లో ట్రై చేయాలని భావించాడు నాగశౌర్య.
Also Read
- Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
నాగశౌర్య కన్నవారికి కూడా అది తెలుసు కాబట్టే, నాగశౌర్యను ప్రోత్సహించారు. ‘క్రికెట్, గర్ల్స్ అండ్ బీర్’ తో తెరపై తొలిసారి కనిపించిన నాగశౌర్య ఆపై ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుకు సాగాడు. ‘చందమామ కథలు’లో రాజుగా పలకరించాడు. ‘ఊహలు గుసగుసలాడే’లో వెంకీగా అలరించాడు. ‘దిక్కులు చూడకు రామయ్యా’ అని హెచ్చరిస్తే, ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ అంటూ అవికా గోర్ ను ఆహ్వానించాడు. ఇలా సాగుతున్న నాగశౌర్య ‘జాదూగాడు’గానూ మురిపించాడు. ఆ తరువాత ‘కళ్యాణ వైభోగమే’ అంటూ పాట పాడాడు.
నాగశౌర్య కన్నవారే తమ ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ‘ఛలో’ సినిమా తీసి జనానికి అతణ్ణి మరింత చేరువ చేశారు. “నర్తనశాల, అశ్వథ్థామ” చిత్రాలు కూడా ఐరా బ్యానర్ పైనే తెరకెక్కి, నాగశౌర్య అభినయం చూసి ఔరా అనేలా చేశాయి. అయితే నాగశౌర్య ఆశిస్తున్న భారీ విజయం ఇప్పటి దాకా అతని దరి చేరలేదు. అయినా పట్టువదలని విక్రమార్కునిలా ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నాడు. గత సంవత్సరం నాగశౌర్య నటించిన ‘వరుడు కావలెను’ ఫరవాలేదనిపించింది. ‘లక్ష్య’తో తన లక్ష్యం నెరవేర్చుకోవడానికి ఎంతగానో తపించాడు నాగశౌర్య. కానీ, ఫలితం దక్కలేదు. ప్రస్తుతం “ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి, నారీ నారీ నడుమ మురారి, పోలీస్ వారి హెచ్చరిక” చిత్రాలతో పాటు అనిష్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు నాగశౌర్య. ఏది ఏమైనా ఏదో ఒకరోజు నాగశౌర్య కృషి ఫలిస్తుందని సినీ ఫ్యాన్స్ అంటున్నారు. మరి అది ఈ యేడాదే సాకారం అవుతుందేమో చూద్దాం.
తాజావార్తలు
-
PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మా శైలపుత్రిపై ఏమన్నారంటే?
-
Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
ట్రెండింగ్
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..