Coolie : కింగ్ నాగార్జున రూట్ మార్చేశాడు. మొన్నటి వరకు హీరోగానే సినిమాలు చేస్తున్న ఆయన.. ఇప్పుడు ఏకంగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేస్తున్నాడు. మొన్ననే కుబేరలో డిఫరెంట్ రోల్ చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు రజినీకాంత్ హీరోగా వస్తున్న కూలీ సినిమాలో పూర్తి విలన్ అవతారం ఎత్తాడు. ఆగస్టు 14న వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను నిన్న రిలీజ్ చేశారు.
Read Also : Allu Aravind : అల్లు అరవింద్ చాకచక్యం.. లాభాల పంట
ఈ ట్రైలర్ లో నాగార్జునను చూసిన వారంతా విక్రమ్ మూవీలో సూర్యతో పోలుస్తున్నారు. లోకేష్ డైరెక్షన్ లోనే వచ్చిన విక్రమ్ లో సూర్య చివరి నిముషంలో విలన్ గా ఎంట్రీ ఇచ్చి దడదడలాడించాడు. ఇప్పుడు ట్రైలర్ లో నాగార్జున పాత్రకు ఆ స్థాయి ఎలివేషన్లు ఇవ్వలేదని అక్కినేని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. తెలుగు నాట భారీ అభిమాన దళం ఉన్న నాగార్జున విలన్ రోల్ చేస్తున్నప్పుడు ఆ స్థాయి ఎలివేషన్లు ఎందుకు ఇవ్వలేదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి మూవీ రిలీజ్ అయ్యాక ఏమైనా అలాంటి సీన్లు నాగార్జునకు ఉంటాయో లేదో చూడాలి.
Read Also : Baahubali : బాహుబలి నుంచి స్పెషల్ వీడియో.. ప్రభాస్ అల్లరి..
