Nagarjuna : కింగ్ నాగార్జునకు తమిళ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రజినీకాంత్ హీరోగా వచ్చిన కూలీ సినిమా ఆగస్టు 14న థియేటర్లలోకి వచ్చింది. చాలా చోట్ల మిక్స్ డ్ టాక్ వచ్చినా కలెక్షన్లకు మాత్రం ఢోకా లేకుండా పోయింది. భారీగా ఓపెనింగ్స్ వచ్చేశాయి. అయితే ఇందులో హీరో రజినీకాంత్ అయినా.. విలన్ సైమన్ పాత్రలో నటించిన నాగార్జునకే అంతా ఫిదా అయిపోతున్నారు. సైమన్ పాత్ర చాలా స్టైలిష్ గా ఉండటంతో పాటు.. హీరో స్థాయిలో పవర్ ఫుల్ గా డిజైన్ చేశాడు లోకేష్. ఇందులో నాగ్ స్వాగ్ తో పాటు స్టైలిష్ లుక్ కు తమిళ తంబీలు ఫిదా అవుతున్నారు.
Read Also : JR NTR : ఎన్టీఆర్ పెద్దమనసు.. అతన్ని ఆదుకుంటున్నాడా..?
దెబ్బకు సైమన్ ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు తమిళ జనాలు. నాగార్జున తన సినిమాల్లో హీరోగా చేసిన దాని కంటే సైమన్ పాత్రలో చాలా స్టైలిష్ గా ఉన్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు. సైమన్ పాత్ర నిజంగానే నాగార్జున కోసమే పుట్టిందా అన్నట్టు పోస్టులు వస్తున్నాయి. పైగా ఈ వయసులోనూ నాగార్జున ఇంత యంగ్ గా కనిపించడంతో తమిళ ప్రేక్షకులు వావ్ అనేస్తున్నారు. నాగ్ డెడికేషన్, హార్డ్ వర్క్ కు వాళ్లు ఫ్యాన్స్ అయిపోతున్నారు. మొత్తానికి హీరోగా తమిళ్ లో రాని క్రేజ్ విలన్ పాత్రతో వచ్చేసిందని అంటున్నారు నాగార్జున తెలుగు ఫ్యాన్స్.
Read Also : Dasari Kiran : వ్యూహం నిర్మాత దాసరి కిరణ్ కుమార్ అరెస్ట్
