Nagarjuna Speech at Naa Saami Ranga Pre Release Event: నా సామిరంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగార్జున మాట్లాడుతూ మనకి సంక్రాంతి అంటే సినిమా పండుగ. ఎప్పుడో టీవీలు వచ్చాయి, టీవీలు వచ్చిన తర్వాత సినిమాల అయిపోయాయి ఎవరూ సినిమాలు చూడరు అన్నారు. దాని తర్వాత ఫోన్లు వచ్చాయి, సినిమాలు చూడరు. డిజిటల్ వచ్చేసింది సినిమాలు చూడరు. వీడియోలు, వచ్చాయి, డివిడిలు వచ్చాయి, ఓటీటీలు వచ్చాయి సినిమాలు చూడరు అన్నారు. కానీ సినిమాలు చూస్తూనే ఉన్నారు. కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చింది ఆ తర్వాత కూడా సినిమాలను చూస్తూనే ఉన్నారు. సంక్రాంతి పండగ రోజున సినిమాలు చూడటం అనేది మనకి ఆనవాయితీ. ఒక సినిమా కాదు రెండు సినిమాలు కాదు మూడు సినిమాలు కాదు నాలుగు సినిమాలు వచ్చినా సరే సినిమాలు చూస్తారు. మన తెలుగు వారికి సంక్రాంతి అంటే సినిమా పండుగ. అలాగే ఈ సంక్రాంతికి వచ్చే నాలుగు సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటున్నాను. ముందుగా సినీ పరిశ్రమలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మహేష్ బాబు గుంటూరు కారంకి ఆల్ ది బెస్ట్, చైల్డ్ ఆర్టిస్ట్ గా వచ్చి ఇప్పుడు హీరో అయిన తేజ హనుమాన్ అనే సినిమాతో వస్తున్నాడు, అతనికి కూడా ఆల్ ది బె.స్ట్ అలాగే మా వెంకీ 75వ సినిమా తో సైన్ధవ్ అంటూ వస్తున్నాడు ఆయనకు కూడా ఆల్ ది బెస్ట్ అని చెప్పుకొచ్చారు. మేము ఇప్పుడు నా నా సామిరంగా అంటూ మీ ముందుకు వస్తున్నాం మీకు మా సినిమా నచ్చితే మీరు ఎంత ఆదరిస్తారరో రెండు పండగలకి ఎక్స్పీరియన్స్ చేశాను.
Sreeleela: ‘గుంటూరు కారం ‘ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శ్రీలీల కట్టుకున్న శారీ ధర ఎన్ని లక్షలో తెలుసా?
మీకు ఈ సినిమా నచ్చుతుందని ఈ పండగకి కూడా మా నా సామి రంగ ని ఆదరిస్తారని భావిస్తున్నాను. మా సినిమాకి స్టార్ ఎవరంటే కీరవాణి గారు, ఆయనే మా సినిమాకి స్టార్. ఆయన ఇచ్చిన పాటలు అలాంటి ఇలాంటి పాటలు కాదు. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పాటలు అయ్యాయి అని అన్నారు. ఇవాళ కొన్ని పాటలు రిలీజ్ చేశాము, అవన్నీ రేపటి నుంచి చూస్తారన్నారు. సినిమా మూడు నెలల్లో పూర్తి చేశామంటే దాని వెనుక ఉన్నది కీరవాణి, ఎందుకంటే ఎప్పటికప్పుడు మా వెనుక ఉండి ఆయన ముందుకు తోస్తూ ఉన్నారు అని చెప్పుకొచ్చారు. సినిమా షూటింగ్ కి వెళ్ళకముందే మూడు పాటలు ఒక ఫైట్ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. విజయ్ లాంటి కొత్త దర్శకుడికి అండదండలు అందిస్తూ ముందుకు నడిపించారు. మూడు నెలలపాటు అందరూ ఒక కుటుంబం లాగా కలిసి సినిమా పూర్తి చేశాం. అయితే జనవరి 14వ తేదీన ఈ కష్టం ఫలించిందా లేదా అనేది తెలుస్తుంది. నాన్నగారి 100 సంవత్సరాల జయంతి సందర్భంగా దండం పెట్టుకుంటే నా మనసులోకి వచ్చిన చెప్పిన మాట నా సామి రంగ వెళ్లి సినిమా చేయరా అన్నారు. ఆయన చెప్పిన ధైర్యంతోనే సినిమాను పూర్తి చేశాం అన్నారు. మా టీం గురించి కో ఆర్టిస్టుల గురించి ప్రొడ్యూసర్ గురించి డైరెక్టర్ గురించి ఇప్పుడు ఏమి చెప్పను సక్సెస్ మీట్ లోనే చెబుతానని అన్నారు. ఈసారి పండక్కి కిష్టయ్య వస్తున్నాడు బాక్సాఫీస్ కొడుతున్నాడు అని అంటూ నాగార్జున స్పీచ్ ముగించారు.