Site icon NTV Telugu

Nayantara : నయనతార రిలేషన్ షిప్ ల గురించి నాగార్జున ఏమన్నారంటే ?

New Project (36)

New Project (36)

Nayantara : లేడీ సూపర్ స్టార్ నయనతార జీవితంపై ”నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్” డాక్యుమెంటరీ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చేసింది. ఆమె సినీ కెరీర్, వ్యక్తిగత జీవితం, ప్రేమ, పెళ్లి వంటి కీలక అంశాలతో ఈ డాక్యుమెంట్ తెరకెక్కించారు. దీనికి అమిత్ కృష్ణన్ దర్శకత్వం వహించారు. నవంబర్ 18 నయన్ 40వ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ డాక్యుమెంటరీ తెలుగు, తమిళం, హిందీ, ఆంగ్ల భాషలలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇటీవల కాలంలో హీరో ధనుష్, నయనతార మధ్య విభేదాలు గురించి వార్తలు హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. తన మొదటి సినిమా ‘నానుమ్ రౌడీ దాన్’ ఫుటేజీని ఉపయోగించుకోనివ్వడం లేదని విమర్శిస్తూ ఈ చిత్రాన్ని నిర్మించిన ధనుష్‌కి నయనతార ఇటీవల బహిరంగ లేఖ రాయడం చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైంది. ఇందులో ఆమె తన భర్త దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో కలిసి పనిచేసింది. వివాదాల మధ్య ఓటీటీలో విడుదలైన నయన్ డాక్యుమెంటరీకి నెటిజన్లు సోషల్ మీడియాలో రివ్యూలు ఇస్తున్నారు.

Read Also:Bhagyashri Borse : ముచ్చటగా మూడు సినిమాలను లాక్ చేసిన భాగ్య శ్రీ బోర్సే

ఈ డాక్యుమెంట్ లో నయనతార చాలా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. హీరోయిన్స్ చాలా మంది తమ ఎక్స్ రిలేషన్ షిప్స్ గురించి అంత వేగంగా ఓపెన్ అప్ కారు. అయితే నయనతార మాత్రం రెండు రిలేషన్స్ షిప్స్ గురించి డాక్యుమెంటరీలో చెప్పుకొచ్చింది. అలాగే వారితో బ్రేక్ అప్ కి కారణాలు కూడా నయనతార వివరించింది. ఇదిలా ఉంటే ఈ డాక్యుమెంటరీలో టాలీవుడ్ మన్మథుడు నాగార్జున కూడా నయనతార గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. నయనతార కెరీర్ స్టార్టింగులో నాగార్జునతో కలిసి ‘బాస్’ మూవీ చేసింది. తరువాత 2013లో ‘గ్రీకువీరుడు’ సినిమా చేసింది. ఇదిలా ఉంటే ‘బాస్’ మూవీ షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనల నాగార్జున చెప్పారు.

Read Also:OTT : ఓటీటీ లోనూ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కిష్కింద కాండం’

నయనతార తొలిసారి సెట్ లోకి వచ్చినపుడు ఆమె అందంతో పాటు నడకలో రాజసం కనిపించిందన్నారు. కొద్ది రోజులు ఆమెతో కలిసి పని చేసిన తర్వాత ఆమెతో స్నేహం చేయాలనిపించింది. నాతో మూవీ చేస్తోన్న సమయంలోనే ఆమె మరొకరితో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు తెలుసుకున్నాను. దాంతో నయనతార చాలా కంగారు పడుతూ ఉండేదని నాగార్జున తెలిపారు. ఫోన్ రింగ్ అయితే ఆమెలో తెలియని ఆందోళన కనిపించేది, మూడ్ మొత్తం డిస్టర్బ్ అయిపోయేది. నువ్వొక ఇండిపెండెంట్ అమ్మాయివి, వర్రీ అవుతూ ఇలాంటి రిలేషన్ లో ఎందుకు ఉన్నావని నయనతారని అడిగానని డాక్యుమెంటరీలో నాగార్జున చెప్పారు. ఈ రిలేషన్ షిప్ గురించి నయనతార సైతం క్లారిటీ ఇచ్చింది. ఫస్ట్ టైం నా రిలేషన్ నమ్మకంతో ఏర్పడిందన్నారు. అయితే అది కోల్పోయిన తర్వాత ఎక్కువ కాలం ఉండలేకపోయానని చెప్పారు. కానీ రిలేషన్ షిప్ బ్రేక్ అప్ అయితే అబ్బాయిలని ఎవరూ నిందించరని, అమ్మాయిల వైపే వేలెత్తి చూపిస్తారని నయన్ తన మనసులో మాటను బయటపెట్టింది.

Exit mobile version