Site icon NTV Telugu

Nagarjuna : 9న నాగార్జున ‘ఘోస్ట్’ ఇంట్రో!

Ghost

Ghost

నాగార్జునతో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి తో కలసి నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ఘోస్ట్’. ఇందులో సోనాల్ చౌహాన్ హీరోయిన్. నాగార్జున టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ సినిమా క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియో ఈ నెల 9న రిలీజ్ కానుంది. సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది.

త్వరలో విడుదల తేదీ ప్రకటించనున్నారు మేకర్స్. ఈ సందర్భంగా పోస్టర్ ను విడుదల చేస్తూ ‘ఘోస్ట్’ ఇంట్రో పరిచయ తేదీని ప్రకటించారు. గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కెమెరాను అందించారు. ఈ చిత్రానికి సమర్పణ: నారాయణదాస్ నారంగ్, నిర్మాతలు: సునీల్ నారంగ్, పుష్కర రామ్మోహనరావు, శరత్ మరార్, దర్శకత్వం: ప్రవీణ్ సత్తార్.

Exit mobile version