Site icon NTV Telugu

Nagababu : తల్లి ఆరోగ్యంపై స్పందించిన నాగబాబు..

Nagababu

Nagababu

Nagababu : మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవికి తీవ్ర అనారోగ్యం అని.. హాస్పిటల్ లో జాయిన్ చేశారంటూ ఉదయం నుంచి వార్తలు వస్తున్నాయి. అటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ కేబినెట్ మధ్యలో నుంచే హైదరాబాద్ వచ్చేస్తున్నాడని.. చిరంజీవి, రామ్ చరణ్ షూటింగ్ క్యాన్సిల్ చేసుకున్ని వస్తున్నారంటూ ఒకటే రూమర్లు వస్తున్నాయి. తాజాగా వీటిపై నాగబాబు స్పందించారు.

Read Also : Amitabh Bachchan : అందుకే ఐశ్వర్యను పొగడను.. అమితాబ్ షాకింగ్ కామెంట్స్

‘మా తల్లి ఆరోగ్యం చాలా బాగుంది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ ఫేక్’ అంటూ ఖండించారు. ఈ రోజు ఉదయం నుంచి ఈ రకమైన వార్తలు రావడంతో మెగా ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేశారు. కానీ అవేమీ నిజం కాదని తేలిపోయింది. గతంలోనూ ఇలాంటి వార్తలు చాలానే వచ్చాయి.

రెండు, మూడు సార్లు చిరంజీవి స్వయంగా స్పందిస్తూ రూమర్లను ఖండించారు. తన తల్లి ఆరోగ్యంపై ఇలాంటివి రాయొద్దంటూ వేడుకున్నారు. కొద్ది నిముషాల క్రితమే ఉపాసన కూడా అంజనాదేవితో చేసిన ఓ వంటల వీడియోను షేర్ చేసింది. దాన్ని బట్టి ఆమెకు ఎలాంటి అనారోగ్యం లేదని తెలుస్తోంది.

Read Also : Kubera : కుబేరకు కలిసొచ్చిన రష్మిక సెంటిమెంట్..

Exit mobile version