Naga Shaurya Farm House Case: యంగ్ హీరో నాగ శౌర్య ప్రస్తుతం తన సినిమా కృష్ణ వ్రింద విహారి సక్సెస్ తో ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. వరుస ప్లాపుల మధ్య ఉన్న ఈ హీరోకు ఈ సినిమాతో ఒక ఊరట లభించిందని చెప్పుకొస్తున్నారు. ఇక ఈ సినిమా హిట్ అందుకోవడంతో ప్రమోషన్ల జోరును పెంచేసిన శౌర్య వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా మారాడు. ఇక తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమాతో పాటు తన పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకున్నాడు. ఇక గతేడాది నవంబర్ లో నాగశౌర్య ఫామ్ హౌస్ లో పోలీసులు రైడ్ చేసి 30 మందిని అరెస్ట్ చేసిన విషయం విదితమే. ఇందులో ప్రధాన నిందితుడిగా గుత్తా సుమన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఈ కేసులో నాగ శౌర్య నాన్నను కూడా పోలీసులు విచారించారు. ఇక ఆ గొడవ నుంచి ఇప్పటివరకు ఈ కేసు విషయమై నోరు ఎత్తని ఈ హీరో ఎట్టకేలకు ఈ ఇంటర్వ్యూలో నోరు విప్పాడు.
“కొన్ని రోజుల క్రితం ఫామ్ హౌస్ ఇష్యూ జరిగింది.. ఇలాంటివి నిజం కానప్పుడు.. ఇది నిజం.. ఇది నిజం అని పదిసార్లు అందరూ చెప్తుంటే మీరేమనుకున్నారు.. మీకు ఆ సమయంలో ఎలా అనిపించింది..?” అన్న ప్రశ్నకు శౌర్య మాట్లాడుతూ “లైమ్ లైట్ లో ఉన్నాం.. లైమ్ లైట్ లో ఉన్నప్పుడు మన మీద పూలు వస్తుంటాయి.. రాళ్లు పడుతుంటాయి. ఎన్నని తప్పించుకుంటాం చెప్పండి” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక తన సినిమాలు హిట్ అవ్వవు అని తెలిసినా తప్పక చేసిన సినిమాలు 16 ఉన్నాయని చెప్పుకొచ్చిన ఈ హీరో తన పెళ్లి అయ్యాకా తల్లి, భార్య గొడవ పడితే.. వారిద్దరిని వదిలేస్తానని చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం శౌర్య వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.