యంగ్ అండ్ డైనమిక్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో ఉషా మూల్పూరి నిర్మిస్తున్న చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. ఇప్పటికే టీజర్, ఫస్ట్ సింగల్ తో ప్రేక్షకుల్లో అంచనాలు పెంచిన ఈ చిత్రం కొత్త విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించింది. సమ్మర్ సీజన్ లోనే మే 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి ఈ సినిమా రానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్మెంట్ పోస్టర్లో నాగశౌర్య సూపర్ కూల్‌గా కనిపించారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ చిత్ర టీజర్ కు అన్నివర్గాల ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభించింది. సినిమా ప్రమోషన్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా విడుదలైన ఈ చిత్రంలోని మొదటి పాట ‘వర్షంలో వెన్నెల’ చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఈ పాటలో నాగ శౌర్య, షిర్లీ సెటియా కెమిస్ట్రీ ఆకట్టుకుంది. మహతి స్వరసాగర్ స్వర పరిచిన ఈ పాట వీక్షకులని అమితంగా అలరించింది. డిఫరెంట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ ట్రైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పిస్తున్నారు. ఈ మూవీలో సీనియర్ హీరోయిన్ రాధిక ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.
Watch Acharya Pre release Event Live :
ఇదిలా ఉంటే.. మే 20న ఇప్పటికే మూడు సినిమాలు విడుదల కాబోతున్నట్టు ప్రకటనలు వచ్చాయి. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ ‘పెళ్ళికూతురు పార్టీ’తో పాటు, సత్యదేవ్ ‘గాడ్సే’, రాజశేఖర్ ‘శేఖర్’ చిత్రాలను మే 20న విడుదల చేయబోతున్నట్టు దర్శక నిర్మాతలు ప్రకటించారు.