Vrushakarma: ‘వృషకర్మ’ నుంచి సాలిడ్ అప్డేట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘విరూపాక్ష’ వంటి బ్లాక్‌బస్టర్ థ్రిల్లర్ తర్వాత దర్శకుడు కార్తీక్ దండు, నాగచైతన్యతో కలిసి చేస్తున్న భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ ‘వృషకర్మ’. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (SVCC) బ్యానర్‌పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్, సుకుమార్ రైటింగ్స్ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ హాంటింగ్ మ్యూజిక్ అందిస్తుండగా, నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో విపరీతమైన హైప్ క్రియేట్ చేసింది. భారతీయ చిత్ర పరిశ్రమలోనే ఇప్పటివరకు చూడని విధంగా ఒక సరికొత్త మైథికల్ ఎలిమెంట్స్‌తో కూడిన కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్, పోస్ట్-ప్రొడక్షన్ పనులకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని మేకర్స్ పంచుకున్నారు.
చిత్ర యూనిట్ వెల్లడించిన తాజా అప్డేట్ ప్రకారం.. రాజస్థాన్‌లోని చారిత్రాత్మక, అత్యంత అందమైన రాజభవనాల బ్యాక్‌డ్రాప్‌లో ప్లాన్ చేసిన ఒక కీలకమైన టాకి, యాక్షన్ షెడ్యూల్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశారు. కథలో ఎంతో ప్రాధాన్యత ఉన్న ఈ షెడ్యూల్ కోసం నాగచైతన్య, హీరోయిన్ మీనాక్షి చౌదరి.. విలన్ పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ నటుడు స్పర్ష్ శ్రీవాస్తవ పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఒకవైపు షూటింగ్ చివరి దశకు చేరుకోగా, మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్-ప్రొడక్షన్ పనులు కూడా చాలా వేగంగా దూసుకుపోతున్నాయి. ‘వృషకర్మ’ అనేది ఒక విజువల్ వండర్‌గా రాబోతుండటంతో, సినిమాలో భారీ ఎత్తున CGI మరియు VFX (కంప్యూటర్ గ్రాఫిక్స్) వర్క్స్ జరుగుతున్నాయి. హాలీవుడ్ రేంజ్లో అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలతో ఈ థ్రిల్లర్‌ను ఆడియన్స్‌కు అందించాలని మేకర్స్ రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. ఈ భారీ గ్రాఫిక్స్ వర్క్స్ పూర్తయిన వెంటనే, అతి త్వరలోనే సినిమా అఫీషియల్ విడుదల తేదీని (Release Date) ప్రకటిస్తామని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది.
Also Read
తాజావార్తలు
-
Vrushakarma: ‘వృషకర్మ’ నుంచి సాలిడ్ అప్డేట్..
-
India Unemployment: ఆరు నెలల గరిష్ఠానికి చేరిన భారత నిరుద్యోగ రేటు.. ఏప్రిల్‌లో 5.2% శాతానికి
-
Medical Shops: మే 20న రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాప్స్ బంద్.. కారణం ఏంటంటే?
-
Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్.. సిమ్‌లు సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు
-
Story Board: మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..