NTV Telugu Site icon

Naga Chaitanya: ఆ డైరెక్టర్ కు ఉన్న కొంచెం పరువును కూడా తీసేసిన చైతన్య

Chy

Chy

Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య చాలా తక్కువ మాట్లాడతాడు అని అందరికి తెల్సిందే. సోషల్ మీడియాలో కూడా చాలా రేర్ గా కనిపిస్తాడు. అతని పర్సనల్ లైఫ్ ను సోషల్ మీడియాలో పంచుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. ఇక సమంతతో విడాకులు అయ్యాకానే కొద్దికొద్దిగా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాడు. ఇక సాధారణంగా చై.. ఎవరి గురించి తప్పుగా కానీ, కోపంగా కానీ మాట్లాడలేదు. చివరికి విడాకులు ఇచ్చిన భార్య సమంత గురించి కూడా చై.. మంచిగానే మాట్లాడాడు. అయితే మొట్ట మొదటిసారి.. ఒక డైరెక్టర్ గురించి చై.. ఘాటు ఆరోపణలు చేశాడు. ప్రస్తుతం ఈ విషయమే సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. యువత సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన డైరెక్టర్ పరుశురామ్ పెట్ల.. ఈ సినిమా తర్వాత.. సోలో, సారొచ్చారు, ఆంజనేయులు, శ్రీరస్తు శుభమస్తు లాంటి సినిమాలతో డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నా.. గీతా గోవిందం సినిమాతో స్టార్ డైరెక్టర్ లిస్ట్ లో చేరాడు.

Ooru Peru Bhairavakona Teaser: ‘విరూపాక్ష’ను మించి భయపెట్టేలా ఉందే

ఇక మొదటి నుంచి కూడా ఇతగాడిపై ఇండస్ట్రీలో ఎవరికి మంచి ఒపీనియన్ లేదని టాక్.. ఎందుకంటే.. ప్రొడక్షన్ కంపెనీల వద్ద సినిమాల కోసం అడ్వాన్సులు తీసుకొని.. సినిమాలను కంప్లీట్ చేయడని ఆరోపణలు ఉన్నాయి. కనీసం అరడజను సంస్థల నుంచి అతను పెద్ద మొత్తంలో అడ్వాన్సులు తీసుకొని ఎగొట్టినట్లు సమాచారం. అందులో నాగ చైతన్య ప్రాజెక్ట్ ఒకటి అని తెలుస్తోంది. గీతా గోవిందం తరువాత చై తో పరుశురామ్.. ఒక సినిమా ఒప్పుకున్నాడు. 14 రీల్స్ బ్యానర్ లో ఆ సినిమాకు అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. అయితే.. తీసుకున్నాకా.. మహేష్ బాబు తో సర్కారు వారి పాట సినిమా అవకాశం రావడంతో చైతన్యను పక్కన పెట్టేశాడు.

Neha Shetty: రాధిక నిన్నలా చూస్తుంటే మైండ్‌లో కిరికిరి షురూ అవుతోంది

అడ్వాన్ ఇచ్చిన 14 రీల్స్ బ్యానర్ ను ఒప్పించి మహేష్ తో సినిమా చేసేలా చేశాడు. అలా చై సినిమా పక్కకు వెళ్లి.. మహేష్ సినిమా పట్టాలెక్కింది. ఇది జరిగి చాలా ఏళ్లే అయినా.. ఇప్పటికీ చై మర్చిపోలేని ఘటనల్లో ఇది ఒకటి. ఇక ఇదే విషయమై రీసెంట్ గా చై స్పందించాడు. పరుశురామ్ గురించి మాట్లాడడం టైమ్ వేస్ట్ అని, అతని గురించి మాట్లాడి.. తన టైమ్ ను వేస్ట్ చేయొద్దని చెప్పుకొచ్చాడు. అతను తన టైమ్ మొత్తం వేస్ట్ చేయించాడని చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పటివరకు సర్కారు వారి పాట సినిమా డైరెక్టర్ గా కొద్దో గొప్పో మిగిలిన పేరు.. చై ఇలా చెప్పడం వలన పోయింది. సినిమా పూర్తి చేయలేని వాడు అడ్వాన్స్ లు తీసుకోవడం ఎందుకు అని నెటిజన్లు పరుశురామ్ ను ఏకిపారేస్తున్నారు. మరి ఈ విషయమై సదురు డైరెక్టర్ ఎలా స్పందిస్తాడో చూడాలి.