సమంతను కాదు కుక్కను అన్నా : సిద్ధార్థ్

సమంత, నాగ చైతన్య విడాకుల విషయం ప్రకటించి సరిగ్గా వారం రోజులు అవుతోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ వాళ్ళు డివోర్స్ తీసుకోవడానికి కారణం ఏమై ఉంటుందా ? అన్న విషయంపైనే అందరి దృష్టి ఉంది. కొంతమంది సమంతను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తుంటే, మరికొంత మంది మాత్రం ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. విడాకుల విషయం ప్రకటించే ముందు ‘మై మామ్ సెడ్’ అంటూ సామ్ చేసిన పోస్టులు వైరల్ అయ్యాయి. సమంత విడాకుల విషయం ప్రకటించిన కొంత సమయంలోనే హీరో సిద్ధార్థ్ “పాఠశాలలో టీచర్ నుండి నేను నేర్చుకున్న మొదటి పాఠాలలో ఒకటి … మోసం చేసేవాళ్ళు ఎప్పటికీ బాగుపడరు. మీరేమంటారు ?” అని నెటిజన్లను ప్రశ్నించాడు. గతంలో వీరిద్దరి మధ్యలో ప్రేమాయణం నడవడంతో అంతా సిద్ధార్థ్ సామ్ గురించే ఈ ట్వీట్ చేశాడని అనుకున్నారు.

Read Also : మా ఎన్నికలు.. నాగబాబు సంచలన వ్యాఖ్యలు

తాజాగా ఓ ఇంటర్వ్యూలో సిద్ధార్థ్ ను ఈ విషయంపై ప్రశ్నించగా తాను ఆ ట్వీట్ ఎందుకు చేశాడో వివరిస్తూ క్లారిటీ ఇచ్చాడు. సమంత ను ఉద్దేశించి ట్వీట్ చేయలేదని సిద్ధార్థ్ ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. తన జీవితంలో జరిగిందే తాను ఆరోజు ట్వీట్ చేశానని, ఎవరో తన గురించి అనుకుంటే తానేమీ చేయలేనని సిద్ధార్థ చెప్పుకొచ్చారు. మా ఇంటి దగ్గర కుక్కల సమస్య ఉంటే, నేను దాన్ని ట్వీట్ చేశాను. దానికి ఎవరో బాధపడితే నాకేం సంబంధం ? అంటూ సిద్ధార్థ చెప్పుకొచ్చాడు. అయితే సిద్ధార్థ్ ఇస్తున్న వివరణకు, ఆయన చేసిన పోస్టుకు పొంతన కుదరకపోవడం గమనార్హం.

శర్వానంద్, సిద్ధార్థ్, అతిథి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రల్లో అజయ్ భూపతి దర్శకత్వం వహించిన “మహా సముద్రం” అక్టోబర్ 14న థియేటర్లలోకి రానుంది.

-Advertisement-సమంతను కాదు కుక్కను అన్నా : సిద్ధార్థ్

Related Articles

Latest Articles