Nagachaithanya : యంగ్ హీరో నాగచైతన్య ప్రజెంట్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. రీసెంట్ గానే తండేల్ మూవీతో భారీ హిట్ అందుకున్నాడు. దాని తర్వాత ఆయన కార్తీక్ దండుతో మైథలాజికల్ సినిమా చేస్తున్నాడు. సాయిధరమ్ తేజ్ తో కార్తీక్ చేసిన విరూపాక్ష పెద్ద హిట్ అయిన విషయం మనకు తెలిసిందే కదా. ఇప్పుడు చైతూతో కూడా అలాంటి సినిమానే ప్లాన్ చేస్తున్నాడు కార్తీక్. ఈ సినిమా కోసం భారీ సెట్లు కూడా వేస్తున్నారు అన్నపూర్ణ స్టూడియోస్ లో. ఇక తాజాగా మూవీ నుంచి మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు.
Read Also : Sravanthi Chokkarapu : ఘాటైన పరువాలు చూపిస్తున్న స్రవంతి చొక్కారపు
ఇది చూసిన వారంతా సినిమా స్టైల్ ను మెచ్చుకుంటున్నారు. నాగచైతన్య కోసం అతిపెద్ద ఓల్డ్ బిల్డింగ్ సెట్ వేయించాడు డైరెక్టర్. దాంతో పాటు ఏదో బ్రహ్మోత్సవాలకు సంబంధించిన సీన్ కూడా కనిపిస్తోంది. దీనికి తోడు హీరో యాక్షన్ సీన్లు కూడా అదిరిపోతాయని మేకింగ్ వీడియో చూస్తేనే అర్థం అవుతోంది. ఇలాంటి భారీ సెట్లు వేసిన మూవీ నాగచైతన్య కెరీర్ లో చేయలేదనే అనిపిస్తోంది. దీన్ని కంప్లీట్ స్క్రిప్ట్ బేస్ గానే తీసుకొస్తున్నట్టు మేకింగ్ వీడియో చూస్తేనే అర్థం అవుతోంది.
Read Also : Mouni Roy : డైరెక్టర్ బలవంతంగా ముద్దు పెట్టాడు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్