Naga Chaitanya Comments at Thandel Movie Opening: తాజాగా జరిగిన తండేల్ మూవీ ఓపెనింగ్ లో హీరో నాగ చైతన్య మాట్లాడారు. ఏడాదిన్నరగా ఈ కథతో ట్రావెల్ అవుతూ వస్తున్నామని, ప్రీ ప్రొడక్షన్ లో ప్రతి అడుగు చాలా ఎంజాయ్ చేశానని అన్నారు. చాలా కొలబరేటివ్ గా పనులు జరిగాయని శ్రీకాకుళం వెళ్లి మత్స్యకార కుటుంబాలని కలవడం, చందూ, నేను కథ పై చర్చించడం, శ్రీకాకుళం యాస పై వర్క్ అవుట్ చేయడం ఇలా చాలా విషయాలపై ప్రత్యేక దృష్టితో పని చేశామని అన్నారు. ఏ సినిమాకి ఇంత ప్లానింగ్ తో ముందుకు వెళ్ళలేదు, ఈ ప్రోసస్ ని చాలా బాగా ఎంజాయ్ చేస్తూ వచ్చాను, ఇది ప్రతి సినిమాలా కాదు చాలా ప్రత్యేకమైనది, బలమైన కథ, కావాల్సిన సమయం తీసుకొని పక్కాగా ప్లాన్ చేసుకొని వెళ్దామని అరవింద్ ముందు నుంచి మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించారన్నారు.
Bunny Vas: చైతుని చూసి షాక్ అయ్యా.. మాటల్లో చెప్పలేను, బన్నీ వాసు కీలక వ్యాఖ్యలు
కథకు కావాల్సిన బడ్జెట్, సపోర్ట్ ఇస్తున్న అరవింద్ గారికి ధన్యవాదాలు. నా కెరీర్ లో గుర్తుండిపోయే సక్సెస్ 100% లవ్ అరవింద్ గారే ఇచ్చారు. ఇప్పుడు ఈ చిత్రాన్ని ఆయన నిర్మించడం చాలా ఆనందంగా వుంది. అలాగే వాసుకి ధన్యవాదాలు, చందూ దర్శకుడిగా కంటే నాకు మంచి స్నేహితుడు, తనతో ప్రతి విషయాన్ని ఓపెన్ గా చర్చించగలుగుతా, మేము ఇద్దరం కలిసి చేస్తున్న మూడో సినిమా ఇదని అన్నారు. సాయి పల్లవి చాలా పాజిటివ్ ఎనర్జీ వున్న యాక్టర్. తను ఈ సినిమాలో భాగం కావడం ఆనందంగా వుంది, దేవిశ్రీ ప్రసాద్, షామ్‌దత్, శ్రీనాగేంద్ర ఇలా అద్భుతమైన టీం ఈ చిత్రానికి పని చేస్తుంది. డిసెంబర్ 15 తర్వాత షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాం. మీ అందరి ఆశీర్వాదం కావాలి’ అని కోరారు.