మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా నట వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నిహారిక రెండు మూడు సినిమాలకే పరిమితమయ్యింది. ఇక ఆ తరువాత చైతన్య జొన్నలగడ్డను వివాహమాడి ప్రస్తుతం నిర్మాతగా కొనసాగుతోంది. ఇక ఇటీవల నిహారిక పబ్ కేసులో పోలీసులకు పట్టుబడ్డ విషయం తెలిసిందే. ఇక ఆ ఇన్సిడెంట్ నుంచి బయటికి రావడానికి కొద్దిరోజులు గ్యాప్ తీసుకున్న అమ్మడు ఇటీవలే బయటికి వచ్చి కొత్త వెబ్ సిరీస్ ను మొదలుపెట్టింది. ఇక తాజాగా నిహారిక తన తల్లి పద్మజతో పాటు ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకోంది.
ఇక ఈ ఇంటర్వ్యూ లో నాగబాబు భార్య, నిహారిక తల్లి పద్మజ మొట్టమొదటిసారి కూతురు కేసు విషయమై నోరు విప్పింది. “నా కూతురు ఏంటో నాకు తెలుసు.. తనెప్పుడు తప్పు చేయదు.. ఆ ఘటన జరిగినప్పుడు వచ్చిన వార్తలు విని చాలా బాధ అనిపించింది. అయితే తప్పు చేయనంత వరకు ఎవరికి భయపడేది లేదు. నిహారిక తప్పు చేసింది అంటే నేను నమ్మను. ఆమె ఎక్కడికి వెళ్లినా నాకేం అనిపించదు.. ఇక ఏదైనా జరిగితే చూసుకోవడానికి మా బావగారు చిరంజీవి ఉన్నారు. ఆయనే మా దైర్యం.. ఆయన ఉన్నంతవరకు మాకేం పర్లేదు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.