Nabha Natesh: అమ్మడు వెనకపడింది అందుకేనట!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nabha Natesh: సుధీర్ బాబు సొంత సినిమా ‘నన్ను దోచుకుందువటే’ తో ఐదేళ్ళ క్రితం టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అందాల ముద్దుగుమ్మ నభా నటేశ్. అయితే ఆ తర్వాత రవిబాబు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘అదుగో’ మూవీ ఆడకపోయినా… పూరి జగన్నాథ్ సొంత సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’తో మాస్ ఆడియెన్స్ కు కిక్కెక్కించింది నభా! 2020లో రవితేజా ‘డిస్కో రాజా’లోనూ, సాయి ధరమ్ తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’ మూవీలోని నభా నటేశ్ నటించింది. ఇక రెండేళ్ళ క్రితం ‘అల్లుడు అదర్స్’లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన నటించిన నభా, నితిన్ సొంత చిత్రం ‘మాస్ట్రో’లో యాక్ట్ చేసింది. చిత్రం ఏమంటే… ఆ తర్వాత మళ్ళీ ఏ సినిమాలోనూ నభా కనిపించలేదు.
ఇక కొత్త సంవత్సరం మొదలైన సందర్భంగా… నభా నటేశ్ గత యేడాది తన జీవితంలో జరిగిన ఘోర సంఘటనలను గుర్తు చేసుకుంది. ఊహించని విధంగా జరిగిన ఓ యాక్సిడెంట్ కారణంగా తన ఎడమ భుజానికి మల్టిపుల్ ఫ్యాక్చర్స్ అయ్యాయని, ఇప్పుడు దాని నుండి కోలుకున్నానని తెలిపింది. ఊహించని ఈ సంఘటనతో శారీరకంగానూ, మానసికంగానూ కూడా తను ఎంతో పెయిన్ అనుభవించానని నభా సోషల్ మీడియా ద్వారా చెప్పింది. ఈ యాక్సిడెంట్ కారణంగా తనకెంతో ఇష్టమైన నటనకు కొద్ది కాలం దూరంగా ఉండాల్సి వచ్చిందని వాపోయింది. అయితే ఈ కష్టకాలంలో అభిమానులు చూపించిన ప్రేమ, తాను చేసిన సినిమాలే గొప్ప ధైర్యాన్ని ఇచ్చాయని, గతంలో కంటే మరింత బలాన్ని పుంజుకుని ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నానని నభా నటేశ్ తెలిపింది. మరి నటన పట్ల అమ్మడికి ఉన్న కమిట్ మెంట్ ను గుర్తించి ఏ నిర్మాత తొలి అవకాశం ఇస్తాడో చూడాలి.
Also Read
- The Paradise Advance Bookings: నైజాంలో నాని మాస్ ర్యాంపేజ్.. గంటల్లోనే లక్ష టికెట్లు సేల్!
- Lust Stories 3: భార్య అదితితో ఇంటిమేట్ సీన్స్.. కెమెరా ముందు అసలు ఏం జరిగిందో చెప్పిన సిద్ధార్థ్!
- Varanasi Update: ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, క్లైమాక్స్.. 'వారణాసి'పై క్రేజీ అప్డేట్ వైరల్!
- Indian Cinema: 'బాహుబలి 2'ను కూడా వెనక్కి నెట్టిన పాత సినిమా.. 12 కోట్లకు పైగా టికెట్లు అమ్మి సరికొత్త రికార్డ్!
తాజావార్తలు
-
Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
-
Ganesh Nimarjan: నది లేకుండా గణేష్ నిమజ్జనం? ఎలా చేయాలి? పర్యావరణాన్ని ఎలా కాపాడాలి?
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు కోర్టు అనుమతి
-
IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
ట్రెండింగ్
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!