Naa Saami Ranga: ఒక సినిమా హిట్ అవ్వడానికి మ్యూజి చాలా ప్రధానం. మ్యూజిక్ హిట్ అయ్యింది అంటే.. థియేటర్స్ కు సాంగ్స్ కోసమైన వెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు వస్తున్నాయి. గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా సామీ రంగ.. థియేటర్ లో సందడి చేయనున్నాయి. మ్యూజిక్ పరంగా చూసుకుంటే.. గుంటూరు కారం, నా సామీ రంగ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా నా సామీ రంగ సాంగ్స్ చాలా బాగా ఆకట్టుకుంటున్నాయి. అక్కినేని నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ హీరోలుగా.. ఆషికా రంగనాథ్, రుక్సార్ థిల్లర్, మీర్నా మీనన్ హీరోయిన్స్ గా విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు విన్నర్ కీరవాణి సంగీతాన్ని అందించాడు. ఇప్పటివరకు ఈ చిత్రం నుంచి రిలీజైన ప్రతి సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంది. ముఖ్యంగా ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుందే సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలిచింది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మరో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఇంకా ఇంకా అంటూ సాగే ఈ సాంగ్ మనసును హత్తుకుంటుంది. నాగ్, ఆషికా ల మధ్య ఈ సాంగ్ నడుస్తోంది. గతంలో వారి ప్రేమను చూపిస్తూ.. ప్రస్తుతం వారి ఒంటరితనాన్ని ఎంతో అద్భుతంగా చూపించారు. ఇద్దరు ప్రేమికుల మధ్య వేదనను కీరవాణి తన లిరిక్స్ లో చూపించగా.. మమన్ కుమార్, సత్య యామిని తమ వాయిస్ తో ప్రాణం పోశారు. ఈ సాంగ్ వింటుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. కీరవాణి చాలా ఫ్రెష్ మ్యూజిక్ ను అందించాడు. ఇక ఈ సాంగ్ విన్న సంగీత అభిమానులు కీరవాణీ.. ఏమిచ్చావయ్యా.. మ్యూజిక్.. ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగి ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.