Mythri Movie Makers: సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా మైత్రి మూవీ మేకర్స్ పేరు మార్మోగిపోతోంది. టాలీవుడ్‌తో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఏ దర్శకుడు హిట్ కొట్టినా.. ఇతర నిర్మాతలకు కనీసం ఆలోచించే ఛాన్స్ కూడా ఇవ్వకుండా మైత్రి వాళ్లు వాలిపోతున్నారు. భారీ అడ్వాన్సులు చేతిలో పెట్టి, తమ బ్యానర్‌కు సినిమా చేసేలా లాక్ చేసేస్తున్నారు. ప్రస్తుతం మైత్రి కాంపౌండ్‌లో ఉన్న డైరెక్టర్ల లిస్ట్ చూస్తుంటే, సౌత్‌లోని క్రేజీ డైరెక్టర్లందరినీ వీళ్లే గంపగుత్తగా పట్టేశారా అన్నట్లు కనిపిస్తోంది.
కన్నడ నుంచి వచ్చి పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ప్రశాంత్ నీల్ మొదలుకొని.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ల వరకు అందరూ ఇప్పుడు మైత్రి బ్యానర్‌కు లాక్ అయిపోయారు. తమిళంలో వరుస హిట్లతో దూసుకుపోతున్న లోకేష్ కనగరాజ్, నెల్సన్, వెట్రిమారన్ లాంటి దిగ్గజ దర్శకులకు ఇప్పటికే మైత్రి అడ్వాన్సులు ఇచ్చేసింది. వీళ్లే కాకుండా సిబి చక్రవర్తి, ఆర్.రవికుమార్, అధిక్ రవిచంద్రన్ వంటి టాలెంటెడ్ తమిళ దర్శకులు కూడా మైత్రి బ్యానర్లో సినిమాలు చేసేందుకు కమిట్ అయ్యారు.
కేవలం తమిళం వరకే ఆగకుండా, మలయాళంలో తమ సినిమాలతో సంచలనం సృష్టించిన దర్శకులు చిదంబరం, జీతూ మాధవన్‌లను కూడా మైత్రి సంస్థ తమ ఖాతాలో వేసుకుంది. ఇలా ఏ భాషలో కొత్త టాలెంట్ కనిపించినా, ఏ డైరెక్టర్ ఖాతాలో బ్లాక్‌బస్టర్ పడినా మైత్రి వాళ్లు వెంటనే రంగంలోకి దిగిపోతున్నారు. ఒకవైపు వందల కోట్ల భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూనే, మరోవైపు ఇలా క్రేజీ డైరెక్టర్లతో కొత్త కాంబినేషన్లు సెట్ చేయడంలో మైత్రి నిర్మాతలు అందరికంటే ముందుంటున్నారు. ఏ ఒక్కరినీ వదలకుండా ఇంతమంది హిట్ దర్శకులను చేతిలో పెట్టుకున్న మైత్రి వాళ్లు.. వీళ్లందరితో ప్రాజెక్టులను ఎప్పుడు పట్టాలెక్కిస్తారో, ఏ హీరోలతో సినిమాలు సెట్ చేస్తారో చూడాలి.

