సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత కోలీవుడ్ లో ఆ రేంజ్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో విజయ్ అండ్ అజిత్ టాప్ ప్లేస్ లో ఉంటారు. ముఖ్యంగా అజిత్ కి మాస్ లో ఉన్న ఫాలోయింగ్ కి వేరే ఏ హీరోకి లేదు. స్టార్ ఇమేజ్ అండ్ యాక్టింగ్ స్కిల్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉండే ఏకైక కోలీవుడ్ హీరో అజిత్ మాత్రమే. అజిత్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అప్పుడే AK63 సినిమా గురించి చర్చ మొదలుపెట్టారు. AK63 ప్రాజెక్ట్ ని అజిత్ డైరెక్టర్ వెట్రిమారన్ తో చేయనున్నాడు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. వెట్రిమారన్ ని ఇప్పటికే వాడివాసల్, ధనుష్ తో సినిమా, విడుదలై 2 సినిమాలు లైనప్ లో ఉన్నాయి. అజిత్ నెక్స్ట్ సినిమా దర్శకుడు లిస్టులో వెట్రిమారన్, సూపర్ డీలక్స్ డైరెక్టర్ త్యాగరాజన్ కుమార రాజన్ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరినీ పక్కకి నెట్టి ఇంకో దర్శకుడి పేరు వినిపిస్తోంది.
ఇటీవలే విశాల్ తో “మార్క్ ఆంటోని” సినిమా చేసి హిట్ కొట్టిన దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్… నెక్స్ట్ అజిత్ ని డైరెక్ట్ చేయబోతున్నాడని సమాచారం. అజిత్ AK63 ప్రాజెక్ట్ ని ఆధిక్ డైరెక్షన్ లో మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం మైత్రీ మూవీ మేకర్స్ చెన్నైలో ఆఫీస్ కూడా ఓపెన్ చేసారు. త్వరలో మైత్రీ ప్రొడక్షన్ లో AK 63 అఫీషియల్ అనౌన్స్మెంట్ బయటకి రానుంది. అయితే తల అజిత్ అంటూ అభిమానులు ప్రేమగా పిలుచుకునే ఈ హీరో ఏ సినిమా చేసినా, ఏ దర్శకుడితో చేసినా ఆ మూవీ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. అప్డేట్ ఇవ్వడంలో మేకర్స్ ఏదైనా డిలే చేస్తే మాత్రం సోషల్ మీడియాలో నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తూ చుక్కలు చూపిస్తారు. బోణీ కపూర్ నుంచి లైకా ఎంటర్టైన్మెంట్స్ వరకూ ప్రతి ఒక్కరూ అజిత్ ఫ్యాన్స్ దెబ్బకి సోషల్ మీడియాలో బెబ్బెలెత్తిన వాళ్లే. ఈసారి ఈ లిస్టులో మైత్రీ మూవీ మేకర్స్ ట్రెండ్ అవ్వకుంటే చాలు.