భూల్ భూలయ్యా3తో కెరీర్‌లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ చూసేశాడు బాలీవుడ్ యంగ్ స్టార్ కార్తీక్ ఆర్యన్. జోవియల్ క్యారెక్టర్లతో యూత్ ఆడియన్స్ ఫిదా చేస్తోన్న ఈ చాక్లెట్ బాయ్.. బడా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు కానీ ఈ ఏడాది ఫ్యాన్స్‌ను పలకరించడం కాస్త కష్టమే. దీనికి టాలీవుడ్ బ్యూటీ శ్రీలీలే కారణం. అనురాగ్ బసు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మ్యూజికల్ లవ్ స్టోరీకి బ్రేకులేసి.. ఉస్తాద్ భగత్ సింగ్ కోసం షిఫ్టైంది మిస్ లీల. షూటింగ్స్‌పై ఎఫెక్ట్ పడటంతో రిలీజ్ డేట్ పై రిప్లేక్షన్ చూపించిందని బజ్. దీపావళికి రిలీజ్ చేస్తామనుకున్న ఈ బొమ్మ నెక్ట్స్ ఇయర్ వాలంటైన్స్ డే వీక్‌కు వెళ్లినట్లు టాక్.
Also Read : Tollywood : మూడు సరికొత్త సినిమాలతో ముస్తాబవుతోన్న టాలీవుడ్
అనురాగ్ బసు చిత్రంలో కలిసి నటిస్తుండటంతోనే.. కార్తీక్ ఆర్యన్- శ్రీలీల మధ్య సంథింగ్.. సంథింగ్ స్టార్టయ్యిందని బజ్ వినిపించింది. వీటిని నిజం చేస్తూ.. ఇద్దరూ రెస్టారెంట్స్‌కు వెళ్లడం.. కార్తీక్ ఇంట్లో ఫంక్షన్‌కు లీల హాజరు కావడం ఈ వార్తలకు ఆజ్యం పోశాయి. అంతేకాదు శ్రీలీలను కార్తీక్ సిస్టర్ ఇన్ స్టాలో ఫాలో కావడం కూడా రూమర్లకు ఊతమిచ్చినట్లయ్యింది. ప్రస్తుతం ఈ ప్రేమ కథా చిత్రానికి బ్రేకులు పడటంతో.. కార్తీక్ ఆర్యన్ తన నెక్ట్స్ ప్రాజెక్టులను కంప్లీట్ చేయడంతో పాటు కొత్త కథలపై ఫోకస్ చేస్తున్నాడు. ప్రజెంట్ బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్‌పై టూ ఫిల్మ్ చేస్తున్నాడు సెల్ఫ్ మేడ్ స్టార్. తు మేరీ మే తేరా మే తేరా తు మేరీతో పాటు నాగ్జిల్లాలో నటిస్తున్నాడు. ధర్మ ప్రొడక్షన్స్ మరియు మహావీర్ జైన్ ఫిలింస్ బ్యానర్లపై నాగ్జిల్లా తెరకెక్కుతోంది. ఫుక్రే ఫేం మృగ్ దీప్ సింగ్ లంబా దర్శకుడు. నెక్ట్స్ ఇయర్ ఆగస్టు 14న బొమ్మ రిలీజ్ చేయబోతున్నట్లు ఎనౌన్స్ చేశారు మేకర్స్. ఇదే కాకుండా పతిపత్ని ఔర్ 2 కూడా చేస్తున్నాడన్నది లేటెస్ట్ బజ్. ఇదే కాదు.. చక్ దే ఇండియా డైరెక్టర్ షిమిత్ అమిన్‌తో వర్క్ చేయబోతున్నాడట. ఇందులో ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా కనిపించబోతున్నాడన్నది లేటెస్ట్ టాక్. మొత్తానికి లవ్ స్టోరీపై ఫోకస్ తగ్గించి.. డిఫరెంట్ కాన్సెప్టులతో కాన్సట్రేషన్ చేస్తున్న కార్తీక్.. నెక్ట్స్ ఇయర్ మాత్రం బాక్సాఫీస్ పై రివేంజ్ తీర్చుకోబోతున్నాడన్నమాట.