Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Music Shop Murthy Movie Director Siva Paladugu Interview

Music Shop Murthy: పుష్ప కంటే ముందే మ్యూజిక్ షాప్ మూర్తి.. అదే అసలు పాయింట్: దర్శకుడు ఇంటర్వ్యూ

Published Date :June 12, 2024 , 5:08 pm
By Bhargav Chaganti
  • అజయ్ ఘోష్ - చాందినీ చౌదరి ముఖ్య పాత్రల్లో మ్యూజిక్ షాప్ మూర్తి
  • జూన్ 14న మ్యూజిక్ షాప్ మూర్తి విడుదల
  • దర్శకుడు శివ పాలడుగు ఇంటర్వ్యూ
Music Shop Murthy: పుష్ప కంటే ముందే మ్యూజిక్ షాప్ మూర్తి.. అదే అసలు పాయింట్: దర్శకుడు ఇంటర్వ్యూ
  • Follow Us :
  • google news
  • dailyhunt

Music Shop Murthy Movie Director Siva Paladugu Interview: అజయ్ ఘోష్, చాందినీ చౌదరి ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘మ్యూజిక్ షాప్ మూర్తి’. ఫ్లై హై సినిమాస్‌ బ్యానర్ పై హర్ష గారపాటి, రంగారావు గారపాటి ఈ మూవీని నిర్మించారు. శివ పాలడుగు ఈ సినిమాకి కథ, కథనాన్ని అందించి దర్శకత్వం వహించారు. ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ జూన్ 14న విడుదల కానుంది. ఈ క్రమంలో దర్శకుడు శివ పాలడుగు మీడియాతో ముచ్చటించారు.

మీ నేపథ్యం గురించి చెప్పండి?
మాది విజయవాడ. అమెరికాలో ఉద్యోగం చేశాను. అక్కడే నాకు ఫ్రెండ్‌గా హర్ష పరిచయమయ్యాడు. అమెరికాలో డైరెక్షన్ కోర్సులో డిప్లోమా చేశాను. నాకు మొదటి సినిమా అవకాశం చాలా సులభంగానే వచ్చింది, నా ఫ్రెండ్స్ నిర్మాతలు కావడంతో అంతా చాలా ఈజీగా జరిగిపోయింది.

‘మ్యూజిక్ షాప్ మూర్తి’ కథకు అజయ్ ఘోష్‌నే ఎందుకు అనుకున్నారు?
పాతికేళ్ల కుర్రాడి కథ చెబితే మళ్లీ రొటీన్ అవుతుంది, కాస్త కొత్తగా ఉండాలని ఈ మ్యూజిక్ షాప్ మూర్తి కథను రాసుకున్నాను. ఈ కథకు అజయ్ ఘోష్ అయితే బాగుంటుంది అనుకున్నాను. కాస్త కొత్తగా ఉంటుందనే ఆయనతో ఈ కారెక్టర్ వేయించాను. ఆయన అద్భుతంగా ఎమోషన్స్ పండిస్తారని నాకు తెలుసు. ఈ సినిమా అనుకుంటున్న టైంలో ఇంకా పుష్ప రాలేదు. కానీ ఆయన ఈ పాత్రను పోషించగలరని అనుకున్నాను.

చాందినీ చౌదరి పాత్రకు ఉన్న ప్రాముఖ్యత ఏంటి?
చాందినీ చౌదరి పాత్రతోనే సినిమా ప్రారంభం అవుతుంది. ఆమె పాత్ర చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. మూర్తి జీవితంలో అంజన వల్ల వచ్చిన మార్పులు సినిమాను ముందుకు తీసుకెళ్తాయి. అంజన కారెక్టర్‌లో చాందినీ చౌదరి అద్భుతంగా నటించారు. ఆమెకు ఇందులో తగిన ప్రాధాన్యం లభించింది.

ఈ సినిమా కోసం మ్యూజిక్ మీద ఏమైనా రీసెర్చ్ చేశారా?
మ్యూజిక్ మీద చాలానే రీసెర్చ్ చేశాం. అప్పటి తరం సంగీతం, నేటి ట్రెండీ మ్యూజిక్ ఇలా అన్నింటిపై పరిశోధించాం, పవన్ మంచి సంగీతాన్ని ఇచ్చారు. ప్రతీ పాట సందర్భానుసారంగానే వస్తుంది. ఎక్కడా ఇరికించినట్టుగా అనిపించదు.

బడ్జెట్ పరంగా ఏమైనా సమస్యలు వచ్చాయా?
ఈ సినిమా ప్రయాణంలో నాకు బడ్జెట్ పరంగా ఎలాంటి సమస్యలు రాలేదు. నా స్నేహితులు నిర్మాతలు కావడంతో, వారు నా మీద నమ్మకంతో ఖర్చుకి వెనకాడలేదు. అనుకున్నదానికంటే కాస్త ఎక్కువ ఖర్చు అయినా.. ఎక్కడా వృధాగా ఖర్చు పెట్టలేదు.

మొదటి సినిమా కదా, ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి?
నాకు మంచి టీం దొరికింది. ఆ టీం సహాయంతోనే సినిమాను ఇంత వరకు తీసుకు రాగలిగాను. అయితే సినిమా తీయడం కంటే.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, రిలీజ్ చేయడం, ప్రమోషన్స్ చేయడం చాలా కష్టంగా అనిపించింది. మొత్తానికి మా సినిమా జూన్ 14న రాబోతోంది. చాలా ఆనందంగా ఉంది.

ప్రస్తుతం పెద్ద సినిమాలే సరిగా ఆడటం లేదు.. మీకు మీ చిత్రంపై ఉన్న నమ్మకం ఏంటి?
చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా ఇప్పుడు లేదు. చిన్న చిత్రాలకు ఓపెనింగ్స్ అంతగా రాకపోవచ్చు. కానీ కంటెంట్ ఉంటే.. ఎమోషన్స్ ఉంటే.. ఆడియెన్స్‌కు కనెక్ట్ అయితే చిన్న చిత్రాలే పెద్ద విజయాలను సాధిస్తాయి. మా సినిమా కంటెంట్, మా చిత్రంలోని ఎమోషన్స్ మీద మాకు చాలా నమ్మకం ఉంది. ఈ చిత్రం అందరికీ నచ్చుతుంది.

చాందినీ చౌదరి రెండు చిత్రాలు ఒకే రోజు వస్తున్నాయి కదా?
చాందినీ చౌదరి గారు నటించిన ఏవమ్ సినిమా కూడా జూన్ 14వ తేదీన రిలీజ్ అవుతోంది. అయితే మా జానర్ వేరు.. ఆ సినిమా జానర్ వేరు.. వారికి సపరేట్ ఆడియన్స్ ఉంటారు.. మాకు సపరేట్ ఆడియన్స్ ఉంటారు. మా చిత్రం ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఉంటుంది.. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం అవుతుంది.

ఈ చిత్రంతో ఏదైనా సందేశం ఇవ్వబోతున్నారా?
ఏదో సందేశం ఇవ్వాలని ఈ కథను రాసుకోలేదు. పాతికేళ్ల వయసులో సాధించలేనిది.. యాభై ఏళ్ల వయసు వచ్చాక సాధించాలనుకుంటే.. ఆ సాధన కోసం చేసే ప్రయత్నం ఎలా ఉంటుంది? ఎంత ఎమోషనల్‌గా ఉంటుందని ఆడియెన్స్‌కు చెప్పాలనే ఈ కథను రాసుకున్నాను.

మీ తదుపరి చిత్రాల గురించి చెప్పండి?
ఈ సినిమా సక్సెస్‌తోనే నా ఫ్యూచర్ కూడా డిసైడ్ అవుతుంది. ఈ సినిమా ఫలితంతోనే నా నెక్ట్స్ ప్రాజెక్ట్‌లను అనౌన్స్ చేస్తాను.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Music Shop Murthy
  • Music Shop Murthy Interview

తాజావార్తలు

  • Ustad Bhagath Singh : ఉస్తాద్‌ భగత్‌సింగ్‌కు భారీ ఓపెనింగ్స్‌ వుండవా?

  • Bus Fire Accident: స్లీపర్ బస్సుకు మంటలు.. బయటకు దూకి ప్రాణాలు దక్కించుకున్న ప్రయాణికులు.!

  • Daily Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారు అప్పు తీర్చేస్తారు!

  • PM Modi: సామాన్యులకు బిగ్ రిలీఫ్.. దేశంలో ఇంధన సంక్షోభంపై ప్రధాని మోడీ క్లారిటీ!

  • Cinema : రూ. 9 కోట్ల బడ్జెట్‌తో తీస్తే ఏకంగా రూ. 50 కోట్లు వసూలు చేసింది

ట్రెండింగ్‌

  • Soft Idli Tips : దూది లాంటి మెత్తటి ఇడ్లీల కోసం చిట్కాలు.. పప్పు, బియ్యం ఎంతసేపు నానబెట్టాలో తెలుసా.?

  • Save Your Food: వేసవిలో అన్నం పాడవకుండా ఉండేలా సింపుల్‌ చిట్కా..!

  • 3.2K డిస్‌ప్లే, డాల్బీ ఆటమ్స్ స్పీకర్స్ వంటి పవర్‌ఫుల్ ఫీచర్లతో Xiaomi Pad 8 లాంచ్.. ధర ఎంతంటే.?

  • Basil Joseph: బ్రో.. నువ్వు ఓ ఫేమస్ హీరో గుర్తుందా..? రోడ్డుపై ఆ అల్లరేంటి.? వీడియో వైరల్..

  • రూ.10,999కే 6300mAh భారీ బ్యాటరీ, HD+ డిస్‌ప్లేతో POCO C85x 5G లాంచ్.. ఫీచర్స్ ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions