NTV Telugu Site icon

Ravi Basrur : డ్రీమ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కించిన మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్

Ravi Basrur

Ravi Basrur

రీసెంట్ టైమ్స్‌లో బిజీయెస్ట్ కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు రవి బస్రూర్. రవి బస్రూర్ అంటే చాలా మందికి కేజీఎఫ్, సలార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా మాత్రమే తెలుసు. కానీ ఆయనలో ఓ ఇన్నర్ టాలెంట్ ఉంది. అదే ఫిల్మ్ మేకింగ్. దర్శకుడిగా ఇప్పటి వరకు ఐదు సినిమాలను తెరకెక్కించిన రవి బస్రూర్ టూ ఇయర్స్  గ్యాప్ తీసుకుని మరోసారి మెగా ఫోన్ పట్టబోతున్నాడు. తన డ్రీమ్ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తున్నాడు.

Also Read : Book launch : హాసం రాజా `ఆపాతమధురం -2′ పుస్తకావిష్కరణ

ప్రశాంత్ నీల్ ఫస్ట్ డైరోక్టోరియల్ ఉగ్రంతో మ్యూజిక్ డైరెక్టర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన రవి బస్రూర్ లెస్ టైంలోనే టాప్ కంపోజర్‌గా ఎదిగాడు. అదే టైంలో మెగాఫోన్ పై మక్కువ పెంచుకున్నాడు. ఇప్పటి వరకు గార్గర్ మండల, బిలిందర్, కటక, గిర్మిత్, కాదల్ సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇప్పుడు తన 12 ఏళ్ల కలను నిజం చేసుకోబోతున్నాడు. కర్ణాటకలో అత్యంత ప్రతిష్టాత్మక హిస్టారికల్ డ్రామా వీర చంద్రహాసను తెరపైకి తీసుకు వస్తున్నాడు. కుంతల రాజ్యానికి చెందిన కథను సిల్వర్ స్క్రీన్ పైకి ప్రజెంట్ చేస్తున్నాడు రవి. ఈ సినిమాపై హైప్ తెచ్చేందుకు కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ను రంగంలోకి దింపాడు. ఇందులో శివన్న కీ రోల్స్ ప్లే చేస్తున్నాడు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని శివ రాజ్ కుమార్ పోస్టర్ రిలీజ్ చేశాడు రవి. ఇందులో నాదప్రభు శివ పుట్ట సామిగా యక్ష గాన కళాకారుడిగా కనిపించబోతున్నాడు. ఓ వైపు కంపోజర్‌గా మరో వైపు డైరెక్టర్‌గా బిజీగా ఉన్న రవి బస్రూర్ ఫిల్మ్ మేకర్‌గా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటాడా చూడాలి.