Site icon NTV Telugu

D Imman : రెండో పెళ్లి చేసుకున్న ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌

Imman

Imman

ఇటీవల 13 ఏళ్ల తన వివాహ జీవితం అనంతరం భార్య మోనికా రిచర్డ్ నుంచి విడిపోతున్నట్లు తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఇమ్మాన్‌ ఇటీవలే అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా ఇమ్మాన్‌ కోలీవుడ్ ఆర్ట్ డైరెక్టర్ ఉబాల్డ్ కుమార్తె అమేలీను రెండో పెళ్ళి చేసుకున్నారు. వీరి పెళ్లికి కుటుంబ సభ్యులు, బంధువులు మాత్రమే హాజరయ్యారు. ప్రస్తుతం.. ఇమ్మాన్‌-అమేలీల పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వివాహానికి గాయకుడు క్రిష్ , నటి సంగీత , సీనియర్ నటి కుట్టి పద్మిని హాజరైనట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. 2008 ఏప్రిల్‌లో కంప్యూటర్ ఇంజనీర్ మోనికాని వివాహం చేసుకున్న ఇమ్మాన్… 13 ఏళ్ళు వివాహబంధం తర్వాత వీరిద్దరూ గతేడాది డిసెంబర్‌‌లో విడాకులు తీసుకున్నారు. వీరికి వెరోనికా డోరతీ ఇమ్మాన్, బ్లెస్సికా కాథీ ఇమ్మాన్ అనే ఇద్దరు కుమార్తెలున్నారు. కోలీవుడ్‌‌లో వన్ అఫ్ ది టాప్ మ్యూజిక్ డైరెక్టర్ లలో ఇమ్మాన్ ఒకరు. 2002లో ప్రియాంక చోప్రా, విజయ్‌ జంటగా నటించిన తమిజన్‌ చిత్రంతో సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన ఇమ్మాన్ .. అజిత్ హీరోగా వచ్చిన విశ్వాసం సినిమాకి గాను నేషనల్ అవార్డు అందుకున్నాడు.

Exit mobile version