Murugadoss Multi Starrer: సల్మాన్, షారూఖ్ తో మురుగదాస్ మల్టీస్టారర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Murugadoss multi-starrer with Salman and Shah Rukh
తమిళ మురుగదాస్ ఓ బడా మల్టీస్టారర్ కోసం స్కెచ్ వేస్తున్నాడు. గతంలో ‘రమణ’ (ఠాగూర్), ‘గజని’, ‘స్టాలిన్’, ‘తుపాకి’, ‘హాలిడే’, ‘కత్తి’, ‘అకీరా’, ‘సర్కార్’ వంటి పవర్ ప్యాక్ డ్ సినిమాలను అందించిన దర్శకుడు మురుగదాస్. రెండేళ్ళుగా ఖాళీగా ఉన్న ఇతగాడు ఇప్పుడు బాలీవుడ్ లో పవర్ ఫుల్ మల్టీస్టారర్ కోసం కసరత్తు చేస్తున్నాడు. బాలీవుడ్ బడా ఖాన్స్ సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్ తో భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడట. ఈ మేరకు ఇద్దరు ఖాన్స్ కి పవర్ ఫుల్ కథను వినిపించాడట. కథ సల్మాన్, షారూఖ్ ఇద్దిరికీ నచ్చటంతో ఓకె చెప్పినట్లు వినిపిస్తోంది.
Also Read
- Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
- Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
- Krrish 4 : 'క్రిష్ 4' ఆలస్యానికి కారణం అదే?
- LGBT - A Legal Battle: 'ఎల్జీబీటీ'ల ఆక్రందనలపై సినిమా.. జూన్ 19న విడుదల!
సల్మాన్, షారుఖ్ గతంలో కొన్ని సినిమాల్లో కలసి నటించారు. వాటిలో కొన్ని రికార్డ్స్ క్రియేట్ చేశాయి. బాలీవుడ్ ను శాసిస్తున్న ఈ ఇద్దరు ఖాన్స్ ఇటీవల కాలంలో వెనుక బడ్డారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా వీరికి పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. స్టార్ డమ్ వచ్చిన తర్వాత వీరిద్దరూ కలసి చేసిన సినిమాలు తక్కువే. అయితే ఒకరి సినిమాలో ఒకరు గెస్ట్ గా మాత్రం నటిస్తూ వస్తున్నారు. తాజాగా రాబోతున్న షారూఖ్ సినిమా ‘పఠాన్’లో సల్మాన్ అతిథిగా నటిస్తుండగా సల్మాన్ ‘టైగర్ 3’లో షారూఖ్ అతిథిగా మెరవనున్నాడు. ఇక ఇదిలా ఉంటే వీరిద్దరూ కలసి నటించిన ‘కరణ్ అర్జున్’ సెన్సేషనల్ హిట్ అయింది. ‘దుష్మన్ దునియా కా’లో ఇద్దరూ గెస్ట్ పాత్రల్లో కనిపించారు. షారూఖ్ నటించిన ‘కుచ్ కుచ్ హోతా హై’ లో సల్మాన్ ప్రత్యేక పాత్రలో కనిపిస్తాడు.
అలాగే వీరిద్దరూ నటించిన ‘హర్ దిల్ జో ప్యార్ కరేగా’ అంతగా ఆకట్టుకోలేక పోయింది. షారూఖ్ హీరోగా దీపిక తొలి చిత్రం ‘ఓం శాంతి ఓం’లో సల్మాన్ ఓ పాటలో కనువిందు చేస్తాడు. అలాగే సల్మాన్ ‘ట్యూబ్‌లైట్’లో షారూఖ్ ఖాన్ మెజీషియన్ గోగో పాషాగా అతిధి పాత్రలో మెరిశాడు. ఇక షారూఖ్ ‘జీరో’లో షారూఖ్, సల్మాన్ ఇద్దరూ ఓ పాటలో కనిపిస్తారు. ఇప్పుడు ఈ ఇద్దరు ఖాన్స్ తో సినిమా మురుగదాస్ మల్టీస్టారర్ తెరకెక్కితే మాత్రం ఫ్యాన్స్ చిందేయక మానరు. ఇటీవల కాలంలో బాలీవుడ్ సరైన సినిమాలు లేక వెలవెల పోతోంది. తెలుగులో ‘ఆర్ఆర్ఆర్’ లాగా బాలీవుడ్ లో అసలు సిసలు మల్టీస్టారర్ లా ఉంటుందనటంలో ఎలాంటి సందేహం లేదు. మరి మురుగదాస్ ప్రయత్నం సఫలం కావాలని కోరుకుందాం.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్‌లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్‌లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!