NTV Telugu Site icon

Ganesh Acharya: ఊ అంటావా.. ఊఊ అంటావా సాంగ్ కొరియాగ్రాఫర్ పై కేసు నమోదు

ganesh acharya

ganesh acharya

బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యపై చార్చ్ షీట్ దాఖలు అయ్యింది. అతడు, అతని అసిస్టెంట్స్ కలిసి ఒక మహిళా కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్ లో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే.. గణేష్ ఆచార్య వద్ద పనిచేసే ఒక మహిళా కొరియోగ్రాఫర్.. అతను తనని లైగింక వేధించడంటూ 2020లో కేసు నమోదు చేసింది. ఫిర్యాదులో ఆమె ఏం చెప్పిందంటే.. 2010లో అతడు తనతో శృంగారం చేయాలని బలవంతపెట్టాడని, పోర్న్ వీడియోలు చూపించి, తన వెంటపడి అసభ్యకరమైన పదజాలంతో తనను వేధించాడని తెలిపింది. అంతేకాకుండా తాను కనుక శృంగారానికి ఒప్పుకోకపోతే ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని, అవకాశాలు కూడా ఇవ్వనని బెదిరించినట్లు తెలిపింది.

ఎంతకు తానూ ఒప్పుకోకపోయేసరికి గణేష్ మాస్టర్, అతని అసిస్టెంట్లు తనపై దాడి చేశారని, 6నెలల్లోనే ఇండియన్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ కొరియోగ్రాఫర్స్‌ అసోసియేషన్‌లో సభ్యత్వం రద్దు చేయించారని తెలిపింది. “ఇక ఈ వేధింపులు తట్టుకోలేక అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాను. నాన్ కాగ్నిసబుల్ కేసు నమోదు చేశాను. అనంతరం తదుపరి చర్యల కోసం లాయర్‌ను కాంటాక్ట్ అయ్యాను” అని తెలిపింది. ఇక ఆమె ఫిర్యాదు మేరకు గణేష్ మాస్టర్, అతని అసిస్టెంట్‌పై 354-ఎ, 354-సి, 354-డి,509,323, 504 సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేశారు.ఇకపోతే గణేష్ ఆచార్య బాలీవుడ్ లో ఫేమస్ కొరియోగ్రాఫర్.. ఇటీవల పుష్ప సినిమాలో ఊ అంటావా.. ఊఊ అంటావా సాంగ్ కి కొరియోగ్రఫీ చేసింది ఆయనే. మరి ఈ కేసుపై గణేష్ ఆచార్య ఎలా స్పందిస్తాడో చూడాలి.