Ganesh Acharya: ఊ అంటావా.. ఊఊ అంటావా సాంగ్ కొరియాగ్రాఫర్ పై కేసు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యపై చార్చ్ షీట్ దాఖలు అయ్యింది. అతడు, అతని అసిస్టెంట్స్ కలిసి ఒక మహిళా కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్ లో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే.. గణేష్ ఆచార్య వద్ద పనిచేసే ఒక మహిళా కొరియోగ్రాఫర్.. అతను తనని లైగింక వేధించడంటూ 2020లో కేసు నమోదు చేసింది. ఫిర్యాదులో ఆమె ఏం చెప్పిందంటే.. 2010లో అతడు తనతో శృంగారం చేయాలని బలవంతపెట్టాడని, పోర్న్ వీడియోలు చూపించి, తన వెంటపడి అసభ్యకరమైన పదజాలంతో తనను వేధించాడని తెలిపింది. అంతేకాకుండా తాను కనుక శృంగారానికి ఒప్పుకోకపోతే ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని, అవకాశాలు కూడా ఇవ్వనని బెదిరించినట్లు తెలిపింది.
ఎంతకు తానూ ఒప్పుకోకపోయేసరికి గణేష్ మాస్టర్, అతని అసిస్టెంట్లు తనపై దాడి చేశారని, 6నెలల్లోనే ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్‌లో సభ్యత్వం రద్దు చేయించారని తెలిపింది. “ఇక ఈ వేధింపులు తట్టుకోలేక అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాను. నాన్ కాగ్నిసబుల్ కేసు నమోదు చేశాను. అనంతరం తదుపరి చర్యల కోసం లాయర్‌ను కాంటాక్ట్ అయ్యాను” అని తెలిపింది. ఇక ఆమె ఫిర్యాదు మేరకు గణేష్ మాస్టర్, అతని అసిస్టెంట్‌పై 354-ఎ, 354-సి, 354-డి,509,323, 504 సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేశారు.ఇకపోతే గణేష్ ఆచార్య బాలీవుడ్ లో ఫేమస్ కొరియోగ్రాఫర్.. ఇటీవల పుష్ప సినిమాలో ఊ అంటావా.. ఊఊ అంటావా సాంగ్ కి కొరియోగ్రఫీ చేసింది ఆయనే. మరి ఈ కేసుపై గణేష్ ఆచార్య ఎలా స్పందిస్తాడో చూడాలి.
Also Read
- AAA Cinemas Vizag: ఈసారి పుష్పరాజ్‌ని కలవడం కష్టమే.. వైజాగ్ AAA ఓపెనింగ్‌కు ఫ్యాన్స్‌కు నో ఎంట్రీ!
- Shahid Kapoor: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు క్రేజీ న్యూస్! AA23లో ఆ బాలీవుడ్ హీరో ఎంట్రీ?
- Arun Matheswaran: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ను హీరోగా ఎలా ఒప్పించాడో చెప్పిన డీసీ డైరెక్టర్!
- Varun Tej: ఆ హీరోయిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో చెప్పిన వరుణ్ తేజ్!
తాజావార్తలు
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
Thailand School Shooting: స్కూల్లో కాల్పులు.. ఉపాధ్యాయుడు మృతి, 20 మంది విద్యార్థులకు గాయాలు..
-
RBI Loan Recovery Rules: లోన్ తీసుకున్నవారికి గుడ్‌న్యూస్.. RBI కీలక ఆదేశాలు..!
-
Vijaya Dairy Election: విజయ డెయిరీ ఎన్నికపై టీడీపీలో హైడ్రామా.. ఆస్పత్రిలో చైర్మన్ చలసాని!
ట్రెండింగ్
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!