Site icon NTV Telugu

అనిల్ రావిపూడి చేతుల మీదుగా ‘ముఖచిత్రం’ ఫస్ట్ లుక్!

mukha chitram

mukha chitram

వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, ’30 వెడ్స్ 21′ ఫేమ్ చైతన్య రావ్, అయేషా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘ముఖచిత్రం’. సోమవారం ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసి టీమ్ కు బెస్ట్ విషెస్ తెలియజేశారు. ‘కలర్ ఫొటో’ మూవీ తో హిట్ కొట్టిన దర్శకుడు సందీప్ రాజ్ ఈ సినిమాకు కథ స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు. కాల భైరవ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాత ఎస్ కేఎన్ సమర్పణలో పాకెట్ మనీ పిక్చర్స్ పతాకంపై ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల ‘ముఖచిత్రం’ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో గంగాధర్ అనే కొత్త దర్శకుడు తెలుగు ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు. ఫన్ అండ్ ఇంటెన్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఫస్ట్ లుక్ లో వికాస్ వశిష్ట, చైతన్య రావ్, అయేషా ఖాన్ నిలబడి ఉండగా… ప్రియ వడ్లమాని రెండు పాత్రల్లో కనిపించడం ఆసక్తిని కలిగిస్తోంది. ఒక పాత్రలో ఆధునిక యువతిగా కనిపిస్తుండగా, మరో పాత్రలో పూర్తి సంప్రదాయంగా చీరకట్టులో ఉంది. ఈ రెండు పాత్రల్లోని వేరియేషన్ సినిమా కథలో కీలకంగా ఉంటుందని అనుకోవచ్చు. ‘కలర్ ఫొటో’ సినిమా తర్వాత దర్శకుడు సందీప్ రాజ్ మరో క్రియేటివ్ స్టోరీని రాసినట్లు తెలుస్తోంది. ఈ కథ బాగా నచ్చినందువల్ల నిర్మాత ఎస్.కె.ఎన్ ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించారని టాక్!

Exit mobile version