Mukesh Rishi: ఆ హీరో సినిమాలో విలన్ గా చేసి తప్పు చేశా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mukesh Rishi: ఇప్పుడంటే కుర్ర హీరోలు విలన్స్ అవుతున్నారు.. ఒకప్పటి స్టార్ హీరోలు విలన్స్ గా మారుతున్నారు. కానీ, ఒకానొక సమయంలో విలన్స్ అంటే.. ఆశిష్ విద్యార్థి, షియాజీ షిండే, ముకేశ్ రిషి.. వీళ్ళే ఉండేవాళ్ళు. ముఖ్యంగా ముకేశ్ రిషి పేరు టాలీవుడ్ లో బాగా వినిపించింది. ఇంద్రలో వీరశంకర్ రెడ్డిగా అయన నటనను ఎప్పటికీ మర్చిపోలేరు. ఇక ఇండస్ట్రీలో మార్పులు వస్తున్న కొద్దీ విలన్స్ కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ గా మారిపోయారు. ప్రస్తుతం ముకేశ్ రిషి.. ఒకపక్క విలన్ గా నటిస్తూనే ఇంకోపక్క వెబ్ సిరీస్ లలో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ బిజీగా మారాడు. తాజాగా ఆయన అమెజాన్ లో స్ట్రీమింగ్ అవుతున్న ది ఇండియన్ పోలీస్ ఫోర్స్ లో ముఖ్యమైన పాత్రలో మెప్పించాడు. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో ముకేశ్ రిషి.. తన కెరీర్ లోని సినిమాల గురించి మాట్లాడాడు. కొన్ని సినిమాల్లో తాను చేసిన పాత్రలు తనకే నచ్చలేదని చెప్తూనే .. ఒక స్టార్ హీరో సినిమాలో నటించి తప్పు చేసినట్లు తెలిపాడు.
” సీనియర్ స్టార్ హీరో మిథున్ చక్రవర్తి హీరోగా నటించిన చిత్రం గుండా. అప్పటికే నేను అన్ని భాషల్లో విలన్ గా నటించి.. మంచి పేరు తెచ్చుకున్నాను. ఆ సమయంలోనే గుండా ఆఫర్ వచ్చింది. సినిమాలో నా పేరు బుల్లా. సినిమా చేసేటప్పుడే నాకు ఎందుకో అనిపించింది.. అనవసరం ఈ పాత్రను ఒప్పుకొని తప్పు చేశాను అని. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి భారీ పరాజయాన్ని అందుకుంది. అయితే ఇదే సినిమా కొన్నేళ్లు తరువాత కల్ట్ బొమ్మగా ట్రెండ్ అయ్యింది. న పాత్రకు, డైలాగ్స్ కు మంచి పేరు వచ్చింది. నేను ఎక్కడికి వెళ్లినా కూడా ఆ డైలాగ్స్ చెప్పమని అడిగేవారు. బుల్లా గా నీ క్రేజ్ ఎలా ఉందో తెలుసా? ఇంటర్నెట్లో మొత్తం నీదే హవా అని సైఫ్ అలీఖాన్ చెప్పేవరకు నాకు ఈ విషయం తెలియలేదు. అప్పుడు ఈ పాత్ర ఒప్పుకొని తప్పు చేశా అనుకున్నాను.. ఆ తరువాత అలా అనుకోవడం తప్పు అని అనిపించింది” అని చెప్పుకొచ్చాడు.
Also Read
- Nagarjuna: భట్టి మాటలతో ఆలోచనలో పడి పళ్ళ బురుసు సినిమా చేశాం
- RGV నుంచి సంచలన సినిమా.. T-Series నిర్మాణంలో ‘పోలీస్ కంపెనీ’!
- Kalki 2 Casting Call: డార్లింగ్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కావాలా? ‘కల్కి 2’ కోసం మేకర్స్ బంపర్ ఆఫర్!
- Ranabaali: రణబాలి రిలీజ్‌పై బిగ్ అప్డేట్! విజయ్ దేవరకొండ-రష్మిక సినిమా కొత్త డేట్ ఇదేనా?
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!