Dating Rumours: మృణాల్, రిషబ్ పంత్‌పై డేటింగ్ రూమర్స్!.. ఒక్క ఇన్స్టాగ్రామ్ ఫాలోతో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dating Rumours: మృణాల్ ఠాకూర్, భారత క్రికెటర్ రిషబ్ పంత్ కు చేసిన ఇన్స్టాగ్రామ్ ఫాలో ఇప్పుడు ఇంటర్నెట్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇద్దరూ ఒకరినొకరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వడం ప్రారంభించడంతో, వారిద్దరి మధ్య ఏదైనా కథ నడుస్తుందా అనే ఊహాగానాలు సోషల్ మీడియాలో వేగంగా వ్యాపిస్తున్నాయి. వైరల్ అవుతున్న సోషల్ మీడియా పోస్టుల ప్రకారం, రిషబ్ పంత్ తన సోదరి తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్న రెండో మహిళ మృణాల్ ఠాకూర్ అని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఇద్దరి ఫాలోయింగ్ లిస్టుల స్క్రీన్షాట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో, ఈ చిన్న పరిణామాన్నే కొందరు డేటింగ్ వార్తలుగా ప్రచారం చేయడం ప్రారంభించారు. ఆఫీషియల్ గా వీళ్ళు ఎలాంటి ప్రకటన చేయనప్పటకీ, అభిమానులు మాత్రం తమదైన ఊహాగానాలతో సోషల్ మీడియాను నింపేస్తున్నారు.
అయితే ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా రిషబ్ పంత్ వ్యక్తిగత జీవితంపై ఇలాంటి వార్తలు వచ్చాయి. ముఖ్యంగా నటి ఊర్వశి రౌతేలాతో ఆయన పేరు తరచూ ముడిపడేది. అయితే ఆ వార్తలను ఊర్వశి ఖండిస్తూ, తమ మధ్య ఎలాంటి ప్రేమ సంబంధం లేదని వెల్లడించారు. ఆ తర్వాత ఆ వదంతులకు ముగింపు పలికినట్లే అయింది. మరోవైపు మృణాల్ ఠాకూర్ కూడా గతంలో నటుడు ధనుష్‌తో డేటింగ్ చేస్తున్నారనే ప్రచారాన్ని ఎదుర్కొన్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా అప్పట్లో వైరల్ అయ్యాయి. అయితే అలాంటి వార్తలపై మృణాల్ నవ్వుతూ స్పందించగా, ధనుష్ కూడా ఎప్పుడూ వాటిని ధృవీకరించలేదు. అనంతరం వారిద్దరూ విడిపోయారనే ప్రచారం కూడా జరిగినా, ఆ విషయంపై కూడా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం మృణాల్ ఠాకూర్, రిషబ్ పంత్ విషయంలో కూడా పరిస్థితి ఇదే. ఇప్పటివరకు బయటకు వచ్చిన ఏకైక విషయం ఇద్దరూ ఒకరినొకరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వడమే. అది స్నేహానికి సంకేతమా, పరిచయమా, లేక కేవలం సోషల్ మీడియా ఫాలోనా, మరేదైనా ఉందా అనేది ఇప్పటికీ స్పష్టంగా తెలియదు. అయినప్పటికీ సోషల్ మీడియా మాత్రం వారిద్దరి చుట్టూ ఒక కొత్త ప్రేమకథను సృష్టించేసింది.
Also Read
- Peddi OTT: రూ.400 కోట్ల బ్లాక్ బస్టర్‌కు షాక్.. 'పెద్ది'కి ఓటీటీలో ఊహించని ఎదురుదెబ్బ!
- Dinesh kumar: హార్ట్ టచ్ చేసే మూవీ 'వెంకట్రామయ్య గారి తాలూకా'.. ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది!
- Dharman : రజనీ సినిమాలో కీలక పాత్రలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్
- Galla Siddharth : సౌత్ కొరియా అమ్మాయితో మహేశ్ బాబు మేనల్లుడి వివాహం
- Tags
- cinema
- Dating Rumours
తాజావార్తలు
-
Dating Rumours: మృణాల్, రిషబ్ పంత్‌పై డేటింగ్ రూమర్స్!.. ఒక్క ఇన్స్టాగ్రామ్ ఫాలోతో వైరల్
-
Boyfriend for Rent: ఇండియాలో అద్దెకు బాయ్‌ఫ్రెండ్.. గంటకు ఎంత ఛార్జ్ చేస్తున్నారు?
-
Mudragada Daughter: కూతురు క్రాంతిని అడ్డుకున్న ముద్రగడ అనుచరులు.. గోబ్యాక్ క్రాంతి అంటూ నినాదాలు!
-
Shubman Gill Retires Hurt: ఆట మధ్యలోనే మైదానం వీడిన కెప్టెన్.. అసలేమైంది.?
-
Toxic Work Culture: వాష్‌రూమ్‌కి వెళ్లిన టైమ్ కూడా కౌంట్ చేశాడు..మేనేజర్ మైండ్‌సెట్‌పై ఉద్యోగి ఆవేదన
ట్రెండింగ్
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!