Site icon NTV Telugu

Mrunal Thakur : ఆ క్షణం నా జీవితంలో మర్చిపోలేను..

Mrunal Tagur

Mrunal Tagur

‘సీతారామం‌’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ మరాఠీ అమ్మాయి మృణాల్ ఠాకూర్. మొదటి మూవీ తోనే టాలీవుడ్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ తర్వాత ‘ది ఫ్యామిలీ స్టార్’, ‘హాయ్ నాన్న’ వంటి సినిమాలు చేశారు. ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ లొ కూడా ఒక అతిథి పాత్రలో కనిపించింది. ప్రస్తుతం ఆవిడ చేతిలో మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి. అయితే బుల్లితెర నుంచి వెండితెరపైకి ఎంట్రీ ఇవ్వడం మామూలు విషయమే. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఓకే కానీ స్టార్ హీరోయిన్‌గా ఫేమ్ తెచ్చుకోవడం అంటే అదృష్టం అనే చెప్పాలి. ఈ విషయం‌లో మృణాల్ ఠాకూర్ చాలా గ్రేట్. ఎందుకంటే హింది సీరియల్స్ నుండి ఇప్పుడు హీరోయిన్‌గా పాన్ ఇండియా సినిమాలు తీసే రెంజ్‌కి ఎదిగిపొయింది. పాత్రలతోనే గుర్తుండిపోయే తారలు చాలా అరుదుగా ఉంటారు. అందులో మృణాల్ రాకూర్ కూడా చేరిపోయింది. ఇక కొత్తదనం నిండిన కథలను ఎంచుకుంటూ సహజమైన నటనతో సినీ ప్రియులను మెప్పించే ఈ భామ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా తన కెరీర్‌కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం పంచుకుంది..

Also Read : Nithin : ‘తమ్ముడు’ నుంచి సాలిడ్ అప్డేట్ కు డెట్‌ఫిక్స్

‘యాక్టింగ్ పై నాకు ముందు నుంచి ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ, దాన్ని ఆచరణలో పెట్టడానికి చాలా సమయం పట్టింది. నటనపై మక్కువ పెంచుకున్నప్పటికీ నా కలల్ని నా ఫ్యామిలీ ఎలా స్వీకరిస్తారో తెలియక. ఎప్పుడూ వారితో పంచుకోలేదు. అనుకోకుండా ఓ రోజు నా స్నేహితురాలు ఒక మరాఠీ షో ఆడిషన్ గురించి చెప్పింది. అక్కడికి వెళ్లాను. అది నా మాతృభాష కాబట్టి.. నేను ఇరగదీసేశాను. అదే నాకు ఓ పాత్రను సంపాదించి పెట్టి.. నటనా ప్రయాణంలో మొదటి అడుగు వేసేలా చేసింది. కెరీర్ లో ఎంతో మంది ప్రేక్షకుల ప్రేమను పొందడానికి కారణమైన ఆ క్షణాలు, నా కెరీర్ లో ఎప్పుడూ ప్రత్యేకమే. ఎలాంటి ప్లానింగ్ చేసుకోకుండా వెళ్ళాను అంత మంచే జరిగింది’ అని చెప్పుకొచ్చింది.

Exit mobile version