NTV Telugu Site icon

Vishwak: మెకానికి రాకి ఫస్ట్ గేర్.. ట్రైలర్ టాక్..

Untitled Design (7)

Untitled Design (7)

టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ మెకానిక్ రాకీగా మెప్పించబోతున్నాడు. ఈ మాస్ యాక్షన్ మరియు కామెడీ ఎంటర్‌టైనర్‌ను నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహించనున్నాడు. SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మించారు. ‘మెకానిక్ రాకి’ ఫస్ట్ గేర్ కు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ని మేకర్స్ ఈరోజు ఆవిష్కరించారు.

విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి మరియు శ్రద్ధా శ్రీనాథ్ మధ్య ట్రయాంగిల్ లవ్ ట్రయాంగిల్‌ను సూచిస్తూ, సినిమాలోని కీలక పాత్రలను ఆవిష్కరించేలా ఫస్ట్ గేర్ రూపొందించారు మేకర్స్. ఈ టీజర్ ఆకర్షణీయమైన వినోదం మరియు డైనమిక్ యాక్షన్ సన్నివేశాల సమ్మేళనాన్ని అందిస్తుంది.మెకానిక్ రాకీ పాత్రలో విశ్వక్ సేన్ అద్భుతమైన నటనను ప్రదర్శిస్తూ ఫ్యాన్స్ కు మాస్ ఫీస్ట్ అందిచాడు. విశ్వక్ సేన్ చెప్పిన ఒకే ఒక్క డైలాగ్, “ఛోటే చోటే బచ్చో కో పూరోన్ కి మై జవాబ్ దేథూ…” బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే “డేంజర్ కే లైసెన్సు ఈదు” అనే డైలాగ్ కూడా అంతే పవర్ఫుల్ గా విశ్వక్ యొక్క డైనమిక్ క్యారెక్టర్‌ని తెలియజేస్తుంది. మీనాక్షి చౌదరి కూల్ గా కనిపించింది. శ్రద్ధా శ్రీనాథ్ అర్బన్ లేడీ పాత్రలో కనిపించింది.

రవితేజ ముళ్లపూడి అన్ని అంశాలతో కూడిన సబ్జెక్ట్‌ని ఎంచుకుని విశ్వక్ సేన్ పాత్రను అద్భుతంగా ప్రెజెంట్ చేశాడు. మనోజ్ కటసాని కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది, అయితే జేక్స్ బెజోయ్ యొక్క ఫంకీ బ్యాగ్రౌండ్ బాగా కుదిరింది. ప్రొడక్షన్ డిజైన్ టాప్-క్లాస్. మొత్తానికి ఫస్ట్ గేర్ అంటూ వచ్చిన మెకానికి రాకి టీజర్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తుంది. మెకానిక్ రాకీ దీపావళి కానుకగా అక్టోబర్ 31న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో విడుదల కానుంది. పనిలో పనిగా మెకానిక్ రాకి ఫస్ట్ గేర్ ను ఓసారి చూసేయండి.

Also Read: Dhanush: పడిలేచిన కెరటం..లోకల్ బాయ్ టూ గ్లోబల్ స్టార్