UI The Movie: ఉప్పీ అంటే ఇంతేరా.. UI ది మూవీ ట్రైలర్ చూశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో ఫస్ట్ అఫ్ ఇట్స్ కైండ్ ఫిల్మ్ ‘UI ది మూవీ’ చిత్రంతో రాబోతున్నారు. లహరి ఫిల్మ్స్, జి మనోహరన్ & వీనస్ ఎంటర్‌టైనర్స్ కెపి శ్రీకాంత్ నిర్మిస్తున్నారు. నవీన్ మనోహరన్ సహా నిర్మాత. ఈ రోజు, మేకర్స్ వార్నర్‌తో ముందుకు వచ్చారు, ఇది మూవీ వరల్డ్ లో ఒక గ్లింప్స్ ని అందిస్తోంది. కథ 2040 సంవత్సరంలో జరుగుతుంది, గ్లోబల్ వార్మింగ్, COVID-19, ద్రవ్యోల్బణం, ఏఐ, నిరుద్యోగం, యుద్ధం యొక్క నిరంతర ముప్పు అస్తవ్యస్తమైన, బాధాకరమైన సమాజానికి దారి తీస్తాయి. వినాశకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ, సామాజిక విభజనలు పాతుకుపోయాయి. కులం,మతం, సంఘర్షణ, విభజన మూలాలుగా వ్యక్తుల జీవితాల మారుస్తాయి. ఈ డిస్టోపియన్ వరల్డ్ లో ఉపేంద్ర నియంత గా కనిపించారు.
Pushpa 2: వైల్డ్ ఫైర్ జాతరకి 1000 మంది పోలీసులు!
Also Read
మార్పు కోసం, న్యాయం కోసం, మంచి భవిష్యత్తు కోసం కష్టజీవుల నిరసనలకు దిగుతారు. ఇప్పుడు పవర్ ఫుల్ గా ఎంట్రీ ఇచ్చిన ఉపేంద్ర రూత్ లెస్ గా కనిపించారు. కథ-కథనంలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న ఉపేంద్ర మరో వినూత్నమైన కాన్సెప్ట్‌తో ఆకట్టుకునేలా ప్రెజెంట్ చేశారు. వార్నర్ ఎక్స్ ట్రార్డినరీ గా వుంది. సినిమా కోసం నిర్మించిన వరల్డ్ గ్రాండ్ ప్రొడక్షన్ డిజైన్‌ను చూపుతుంది. హెచ్‌సి వేణుగోపాల్ క్యాప్చర్ చేసిన విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి, అజనీష్ బి లోక్‌నాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్ఫెక్ట్ మూడ్ సెట్ చేసింది. ఆర్ట్ డైరెక్షన్ శివ కుమార్ J (KGF1&2 ఫేమ్), VFX ని నిర్మల్ కుమార్ (విక్రాంత్ రోనా ఫేమ్) పర్యవేక్షిస్తున్నారు. ఈ చిత్రంలో రీష్మా నానయ్య, మురళీ శర్మ, సన్నీలియోన్, నిధి సుబ్బయ్య, సాధు కోకిల, మురళీ కృష్ణ, ఇంద్రజిత్ లంకేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గ్లింప్స్ లో అనౌన్స్ చేసినట్లుగా UI మూవీ డిసెంబర్ 20, 2024న విడుదల అవుతుంది.
తాజావార్తలు
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్‌లు..
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!