Site icon NTV Telugu

Lucky Baskhar Trailer : ఆసక్తి పెంచేస్తున్న లక్కీ భాస్కర్ ట్రైలర్

Dq

Dq

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమవుతున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ మీద నాగవంశీ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ మీద సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు ఆకట్టుకొని సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయి. ఇక ‘లక్కీ భాస్కర్’ ట్రైలర్‌ను ఈరోజు రిలీజ్ చేశారు. ఈ ‘లక్కీ భాస్కర్’ ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. డబ్బు కోసం ఎంత రిస్క్ అయినా చేసే భాస్కర్ పాత్రలో దుల్కర్ సల్మాన్ కనిపిస్తున్నారు. తాను తలచుకుంటే ఏదైనా చేయగలిగే అంత ధనవంతుడు కావాలని అనుకుంటాడు. బాగా డబ్బు సంపాదిస్తే, శ్వాస కూడా గౌరవించబడుతుంది అనేది అతని సిద్ధాంతం.

Bigg Boss 8 Telugu: ఆ కంటెస్టెంట్ ను వెనక్కి రప్పించేందుకు విశ్వప్రయత్నాలు

ఇక భాస్కర్ పాత్రలో దుల్కర్ సల్మాన్ అద్భుతంగా ఒదిగిపోయారు. ఇక ట్రైలర్ లో “Sumathi, I’m not bad, I’m just rich”, “సిగరెట్, ఆల్కహాల్, డ్రగ్స్ ఇచ్చే కిక్ కన్నా డబ్బు ఇచ్చే కిక్ ఎక్కువ”, “ఇది ఇండియా.. వస్తువు కావాలంటే డబ్బుతో కొనాలి రెస్పెక్ట్ కావాలంటే అ డబ్బు మన ఒంటి మీద కనిపించాలి” వంటి పదునైన సంభాషణలు ఆకట్టుకున్నాయి. ప్రముఖ స్వరకర్త జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన నేపథ్య సంగీతం ట్రైలర్ కు అదనపు బలంగా నిలిచింది. ఇప్పటికే పాటలతో విశేషంగా ఆకట్టుకున్న ఆయన, నేపథ్య సంగీతంతో అద్భుతాలు సృష్టించబోతున్నారని ట్రైలర్ తో చెప్పేశారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ‘లక్కీ భాస్కర్’ చిత్రం తెలుగు, మలయాళం, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో అక్టోబర్ 31న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.

Exit mobile version