ఫహద్ ఫాసిల్, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన మలయాళ చిత్రం ‘అథిరన్’. 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ప్రేక్షకులను థ్రిల్ చేసింది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని తెలుగులో “అనుకోని అతిథి”గా విడుదల చేస్తున్నారు. వివేక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అతుల్ కులకర్ణి, రెంజీ పానికర్, శాంతి కృష్ణ, ప్రకాష్ రాజ్, సురభి ముఖ్యమైన పాత్రలు పోషించారు. జిబ్రాన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో తెలుగులో డిజిటల్ గా రిలీజ్ కానుంది. మే 28నుంచి ప్రముఖ తెలుగు ఓటిటి వేదికపై స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా “అనుకోని అతిథి” తెలుగు టీజర్ ను విడుదల చేశారు. థ్రిల్ ను ఇష్టపడే ప్రేక్షకులను ఈ టీజర్ బాగా ఆకట్టుకుంటోంది. మీరు కూడా ఈ టీజర్ ను వీక్షించండి.