రీసెంట్లీ మోహన్ లాల్ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో కేరళ బాక్సాఫీసుపై దండయాత్ర చేస్తున్నాడు. ఇప్పటికే గత ఏడాది చివరిలో బర్రోజ్ ను దింపితే.. జనవరిలోనే తుదరం చిత్రాన్ని తీసుకు వస్తున్నాడు. ఇప్పుడు ఇదే ఫాలో అవుతన్నాడు మమ్ముట్టి. వరుస నెలల్లో టూ ప్రాజెక్టులతో దూసుకొస్తున్నాడు ఈ మాలీవుడ్ మెగాస్టార్. గౌతమ్ వాసు దేవ్ మీనన్ దర్శకత్వంలో వస్తున్న ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ సంక్రాంతి నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Also Read : VFX : ‘కల్పర వీఎఫ్ఎక్స్ అండ్ ఏఐ’ సర్వీసెస్ ను ప్రారంభించిన దర్శకులు శ్రీను వైట్ల
యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న డొమినిక్ జనవరి 23న మెగాస్టార్ ఫ్యాన్స్, సినీ ప్రియుల్ని పలకరించబోతుంది. మమ్ముట్టి కంపెనీపై ఈ సినిమాను స్టార్ హీరోనే నిర్మిస్తున్నాడు. ఇక జస్ట్ ట్వంటీ డేస్ గ్యాప్ లోనే మరో ప్రాజెక్టును బాక్సాఫీసు ముందుకు తెచ్చేస్తున్నాడు మమ్ముట్టి. యాక్షన్ త్రిల్లర్ భజూకను ఫిబ్రవరిలోనే రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్రిపేరయ్యారు. భజూక వాలంటైన్స్ డేను టార్గెట్ చేసింది. ఫిబ్రవరి 14న అంటే లాస్ట్ ఇయర్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బ్రహ్మాయుగానికి ఒక్క రోజు ముందు ఈ సినిమాను థియేటర్లోకి దింపుతున్నాడు. డీనూ డెన్నిస్ దర్శకత్వం హించిన ఈ చిత్రంలో గౌతమ్ వాసు దేవ్ మీనన్ వర్క్ చేస్తున్నాడు. పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు ఈ స్టార్ డైరెక్టర్. ఓ వైపు దర్శకుడిగా మరో వైపు యాక్టర్ గా ఫ్రూవ్ చేసుకోవాల్సిన సిచ్యుయేషన్ ఈ దర్శకుడిది. ప్రెజెంట్ ఇవే కాకుండా మరో రెండు చిత్రాలను లైన్లో పెట్టాడు మమ్ముట్టి.