Mohanlal: కుర్ర హీరోలకే షాకిచ్చేలా .. ఒకేసారి 7 స్టార్ డైరెక్టర్లతో సినిమాలు అనౌన్స్ చేసిన లెజెండరీ హీరో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohanlal: మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తన నెక్ట్స్ ప్రాజెక్టులకు సంబంధించి తాజాగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చారు. ఏకంగా ఏడు సినిమాల్లో ఆయన నటించనున్నట్లు వెల్లడిస్తూ.. వాటిని తెరకెక్కించనున్న డైరెక్టర్ల పేర్లను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. “ఎగ్జైటింగ్ స్టోరీస్, ఎగ్జైటింగ్ జర్నీస్, కొందరు ఎంతో ప్రత్యేకమైన ఫిల్మ్‌మేకర్స్” అంటూ మోహన్‌లాల్ తన ఏడు ప్రాజెక్టులపై ఆసక్తిని పెంచారు. ఆయన లైనప్‌లో విష్ణు మోహన్, అనూప్ సత్యన్, ప్రియదర్శన్, దిలీష్ పోతన్, సత్యన్ అంతిక్కాడ్, జూడ్ ఆంథనీ జోసెఫ్, జీతూ జోసెఫ్ వంటి స్టార్ డైరెక్టర్స్ ఉన్నారు.
ఈ లీస్ట్‌లో విష్ణు మోహన్, అనూప్ సత్యన్ వంటి యంగ్ డైరెక్టర్స్‌తో పాటు ప్రియదర్శన్, సత్యన్ అంతిక్కాడ్ వంటి సీనియర్ ఫిల్మ్‌మేకర్స్ ఉండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. మరోవైపు విభిన్న కథలు, సహజమైన కథనాలతో గుర్తింపు తెచ్చుకున్న దిలీష్ పోతన్‌తో మోహన్‌లాల్ కాంబినేషన్ ఎలా ఉంటుందనే ఆసక్తి కూడా ప్రేక్షకుల్లో నెలకొంది. ఇక ‘2018’తో భారీ సక్సెస్ అందుకున్న జూడ్ ఆంథనీ జోసెఫ్, ‘దృశ్యం’ సిరీస్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జీతూ జోసెఫ్‌తోనూ మోహన్‌లాల్ సినిమాలు చేయనున్నారు. దీంతో ఈ ఏడు ప్రాజెక్టులు విభిన్న కథాంశాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. అయితే ఈ సినిమాలకు సంబంధించిన కథలు, షూటింగ్ షెడ్యూల్స్, నటీనటులు, రిలీజ్ డేట్స్‌పై పూర్తి వివరాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది. మోహన్‌లాల్ ఒకేసారి ఏడుగురు ప్రముఖ దర్శకులతో ప్రాజెక్టులు ప్రకటించడం మలయాళ సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.
Also Read
- Prabhas-Hanu Raghavapudi: ‘ఫౌజీ’తో ఆగదట.. హను రాఘవపూడితో ప్రభాస్ మరోసారి జతకట్టనున్నాడా?
- Vishwanath & Sons : 4 రోజుల్లో ₹150 కోట్ల మార్క్ దాటిన 'విశ్వనాథ్ & సన్స్'!
- Varanasi: ‘వారణాసి’పై జక్కన్న మరో క్రేజీ ప్లాన్.. షూటింగ్ వెనుక సీక్రెట్స్ అన్నీ బయట పెడతాడట?
- OG 2 నుంచి వరుస ట్రీట్స్.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు మాస్ కిక్ స్టార్ట్!
తాజావార్తలు
-
Mohanlal: కుర్ర హీరోలకే షాకిచ్చేలా .. ఒకేసారి 7 స్టార్ డైరెక్టర్లతో సినిమాలు అనౌన్స్ చేసిన లెజెండరీ హీరో!
-
Tamil Nadu: చంటి బిడ్డతో అసెంబ్లీకి వచ్చిన టీవీకే ఎమ్మెల్యే.. విమర్శలపై కౌంటర్
-
Crispy Drumstick Fry Recipe: మునగకాయతో క్రిస్పీ స్నాక్.. రెసిపీ సింపుల్!
-
Prabhas-Hanu Raghavapudi: ‘ఫౌజీ’తో ఆగదట.. హను రాఘవపూడితో ప్రభాస్ మరోసారి జతకట్టనున్నాడా?
-
Supreme Court: ఉరిశిక్షకు బదులుగా ఇంజెక్షన్.. సుప్రీంకోర్టు కీలక తీర్పు..
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!