Mohanlal delivers a solid hit with Neru: మన తెలుగు హీరో ప్రభాస్ సలార్ ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ అందుకోగా ఇప్పుడు మరో సీనియర్ హీరో కూడా హిట్ కొట్టినట్టు తెలుస్తోంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఎట్టకేలకు ‘నెరు’తో ఒక బ్లాక్ బస్టర్ మూవీని ప్రేక్షకుల ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమా బాక్సాఫీస్ మంచి వసూళ్లు రాబడుతోంది అని అంటున్నారు. నిజానికి మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ గత కొన్ని సినిమాలు పెద్దగా విజయం సాధించలేదు. లూసిఫర్ తర్వాత, మోహన్ లాల్ చేస్తున్న అని సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. మరీ ముఖ్యంగా ఆ సినిమాల కంటెంట్ ఆకట్టుకునేలా లేదు. లాల్ హీరోగా నైటీనిచ్చిన చివరి రెండు సౌండ్ ఫిల్మ్‌లు, బ్రో డాడీ అలాగే – దృశ్యం 2, కరోనా వైరస్ మహమ్మారి కారణంగా నేరుగా థియేటర్స్ లో రిలీజ్ చేయకుండా నేరుగా OTTలో రిలీజ్ చేశారు. అందుకే నాలుగేళ్ల పాటు బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకోలేకపోయాడు.
Salaar Review: ప్రభాస్ ‘సలార్’ మూవీ రివ్యూ!
ఇక ఆయన సరైన హిట్ తో మంచి కంబాక్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరో వైపు, ఆయనకు బలమైన పోటీగా ఉండే మమ్ముట్టి నిరంతరం బ్లాక్‌బస్టర్‌లు అందిస్తూ మంచి కంటెంట్ ఉన్న సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఇప్పుడు దృశ్యం కాంబో తాజా మూవీ నేరుతో రిపీట్ అయింది. ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించే కంటెంట్ తో ఉండడంతో కలెక్షన్స్ కూడా మంచిగానే వస్తున్నాయి. నిజానికి ఈ సినిమా నిన్న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. కోర్టు డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకి మంచి పాజిటివ్ బజ్ వస్తోంది. మొదటి రోజు కలెక్షన్స్ పూర్తిగా వెల్లడి కాలేదు కానీ గట్టిగానే వచ్చాయని అంటున్నారు. బుకింగ్‌లు కూడా చాలా మెరుగుపడ్డాయని, నెరు ఘన విజయం సాధించి బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను రాబడుతుందని భావిస్తున్నారు. మోహన్ లాల్ ఎట్టకేలకు నెరుతో మంచి కంటెంట్ ఉన్న సినిమాను అందించాడని అంటున్నారు ఆయన ఫాన్స్.