The Paradise : నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న ది ప్యారడైజ్ సినిమా షూటింగ్ స్పీడ్ గా జరుగుతోంది. ప్రస్తుతం సికింద్రాబాద్ లో వేసిన ఓ భారీ సెట్స్ లో ఈ మూవీ షూట్ జరుగుతుంది. ఈ సినిమాలో విలన్ పాత్రలో మోహన్ బాబు మెరుస్తున్నారు. చాలా కాలం తర్వాత ఆయనకు ఓ పవర్ ఫుల్ రోల్ పడుతోంది. తాజాగా మూవీ నుంచి ఆయన పోస్టర్ రిలీజ్ చేశారు. ఉదయం ఆయన చొక్కా లేకుండా కుర్చీలో మాసివ్ ఫోజ్ లో ఉన్న పోస్టర్ వదిలారు. తాజాగా ఆయన స్టైలిష్ గా ఉన్న లుక్ ను రిలీజ్ చేశారు. ఇందులో ఆయన లుక్ అల్టిమేట్ గా కనిపిస్తోంది. ఈ లుక్ లో ఆయన గన్ పట్టుకుని నోట్లో చుట్ట వెలిగించుకుని కనిపిస్తున్నాడు.
Read Also : Mirai : తగ్గిన మిరాయ్ టికెట్ ధరలు..!
ఈ లుక్ క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయిపోతోంది. మోహన్ బాబు విలన్ పాత్రలో కనిపించి చాలా కాలం అవుతోంది. ఇన్నేళ్లకు ఆయన ఓ పవర్ ఫుల్ రోల్ ను చేయడంతో మూవీపై బజ్ పెరిగిపోయింది. ఇందులో ఆయన కనిపించిన తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. ఆయన లుక్ మీద పాజిటివ్ వైబ్ కనిపనిస్తోంది. మరి ఇన్ని రోజులకు ఓ మంచి పాత్రలో మోహన్ బాబు కనిపిస్తున్నారు కాబట్టి.. ఆయనకు ఇది మరో గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి. ఎంతైనా మోహన్ బాబుకు విలన్ పాత్రల్లో కనిపించడం అంటే వెన్నతో పెట్టిన విద్య. ఫస్ట్ టైమ్ నాని సినిమాలో కనిపించబోతున్నాడు మోహన్ బాబు. ఈ సినిమా మార్చిలో రిలీజ్ కాబోతోంది.
Read Also : Mohan Babu : మోహన్ బాబుకు గొప్ప ఛాన్స్.. ఇక మామూలుగా ఉండదా..?
SHIKANJA MAALIK
Joins the sets… @themohanbabu 🔥#TheParadise pic.twitter.com/Kd4Lp0mgjQ
— Nani (@NameisNani) September 27, 2025
