ఫస్ట్ కాపి మూవీస్, కేడి&కో బ్యానర్లపై పంచుమర్తి నరేష్ బాబు నిర్మిస్తున్న సరికొత్త చిత్రం ‘మిస్సింగ్ మేఘన’. వాచస్పతి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌లో రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు టైటిల్ రివీలింగ్ పోస్టర్‌ను సెన్సేషనల్ డైరెక్టర్ వి. వి. వినాయక్ ఆవిష్కరించారు. ఈ వేడుకలో ప్రముఖ నిర్మాత బెక్కం వేణుగోపాల్ సహా చిత్రబృందం పాల్గొంది.
ఈ సందర్భంగా వి.వి. వినాయక్ మాట్లాడుతూ, “నిర్మాత బెక్కం వేణుగోపాల్, శ్రీనివాస్ ల మద్దతుతో దర్శకుడిగా పరిచయమవుతున్న వాచస్పతికి, హీరో రామ్ కార్తీక్‌కు ఈ సినిమా పెద్ద విజయాన్ని అందించాలి. మ్యూజికల్ ఆల్రౌండర్ ఆర్.ఆర్. ధృవన్ పాటలు, సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. చిత్ర యూనిట్ అందరికీ ప్రేక్షకుల ఆదరణ లభించాలని కోరుకుంటున్నాను” అని ఆకాంక్షించారు. దర్శకుడు వాచస్పతి మాట్లాడుతూ, “గోల్డెన్ హ్యాండ్ కలిగిన వి. వి. వినాయక్ గారు మా పోస్టర్ లాంచ్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఇది ఒక ఉత్కంఠభరితమైన సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. త్వరలోనే ఈ చిత్రాన్ని మీ ముందుకు తీసుకువస్తాం” అని తెలిపారు. రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య, గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్, మహిపాల్, రుచిత, నళిని, శ్రీనివాస్, అజీమ్, పండు తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు.

