Miss Shetty Mr Polishetty got U/A and got super positive report from Censor: పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులకు కంప్లీట్ ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చేందుకు ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సిద్ధమవుతోంది అంటున్నారు మేకర్స్. యంగ్ టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా రూపొందిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సినిమా మొత్తం చూసిన సెన్సార్ సభ్యులు సినిమా యూనిట్ ని అభినందనలతో ముంచెత్తి యూ/ఏ సర్టిఫికెట్ అందించారు. కామెడీ ప్రధానంగా సాగే ఈ సినిమాలో కొన్ని సీన్స్ మాత్రం అడల్ట్ కామెడీ అనిపించడంతో యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే సినిమా ఆద్యంతం నవ్వులు పూయించిందని సెన్సార్ సభ్యులు చెప్పినట్టు తెలుస్తూంది. సెన్సార్ కూడా పూర్తి కావడంతో ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా ఇక తెరపైకి రావడమే తరువాయి అని చెప్పాలి.
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అంటూ మొదటి నుంచి సినిమా టీమ్ చెబుతున్న మాటలు సెన్సార్ యూఏ సర్టిఫికేషన్ తో ప్రూవ్ అయ్యాయి అని చెప్పచ్చు. ఈ సినిమా ఐడియల్ రన్ టైం కూడా 151 నిమిషాలుగా ఉంది అంటే రెండు గంటల 31 నిముషాలు అన్నమాట. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కథతో ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ నిర్మాణంలో దర్శకుడు మహేష్ బాబు.పి తెరకెక్కించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా సెప్టెంబర్ 7న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా టీజర్, పాటలు, ట్రైలర్ కు మంచి స్పందన రావడంతో ఇదే రెస్పాన్స్ రేపు థియేటర్ లో కూడా దక్కుతుందని నమ్మకంతో మూవీ టీమ్ ఉన్నారు. మరోవైపు సినిమాను ఆడియెన్స్ కు మరింత దగ్గర చేసేందుకు ప్రమోషన్ టూర్స్ చేస్తున్న హీరో నవీన్ పోలిశెట్టి గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, నెల్లూరులో పర్యటిస్తున్నారు.