Miral to Release on May 17th in Telugu : ప్రేమిస్తే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన భరత్ ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ మూవీ ‘మిరల్’తో మే 17న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యాడు. భరత్ హీరోగా, వాణి భోజన్ హీరోయిన్‌గా విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ సంయుక్తంగా తెరకెక్కించిన ‘మిరల్’ మూవీని సీహెచ్ సతీష్ కుమార్ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. హారర్, సస్పెన్స్ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా రాబోతోన్న ఈ చిత్రానికి ఎం శక్తివేల్ దర్శకత్వం వహించగా రీసెంట్‌గా విడుదల చేసిన ట్రైలర్ అందరినీ ఎంతగా భయపెట్టిందో అందరికీ తెలిసిందే. ఇక ఈ ట్రైలర్‌తో ఒక్కసారిగా మిరల్ మూవీ మీద అంచనాలు పెరిగాయి. జగన్మోహిని & జి డిల్లి బాబు సమర్ఫణలో రాబోతోన్న ఈ సినిమాను మే 17న గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు మేకర్స్.
Teja Sajja: మాస్ స్పెషలిస్ట్ తో తేజా సజ్జా కొత్త మూవీ.. ఇదేప్పుడు ప్లాన్ చేసారు మామా ?
ఇక ఈ మేరకు వదిలిన పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. అసలు సినిమా కథ ఏంటి? ఏ పాయింట్ చుట్టూ తిరుగుతుంది? ప్రధాన పాత్రలు ఏంటి? అన్నది కూడా ఈ పోస్టర్‌లోనే చూపించారు. ట్రైలర్‌లోనూ ఓ వింత మాస్క్ హైలెట్ అయింది. ఇప్పుడు ఈ పోస్టర్‌లోనూ ఆ మాస్క్‌ను చూపించగా అసలు ఆ మాస్క్ కథ ఏంటి? అనే ఆసక్తిని రేకెత్తించేలా ట్రైలర్, పోస్టర్‌ను డిజైన్ చేశారు. ఈ సినిమాకి ప్రసాద్ ఎస్ ఎన్ సంగీతాన్ని అందించగా సురేష్ బాలా సినిమాటోగ్రఫర్‌గా పని చేశారు. ఎడిటర్‌గా కలైవానన్ ఆర్ వ్యవహరించారు. భరత్, వాణి భోజన్తో కలిసి K.S.రవికుమార్, మీరాకృష్ణన్, రాజ్‌కుమార్, కావ్య అరివుమణి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.