తేజ సజ్జా హీరోగా ఈగల్ సినిమా ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న మూవీ మిరాయ్. ఇందులో తేజ ఓ యోధుడిగా కనిపించబోతున్నాడు. మంచు మనోజ్ యాంటోగనిస్టుగా కనిపించడం కూడా ఈ సినిమాకు మరింత హైప్ క్రియేట్ చేసింది. రితికా నాయక్ హీరోయిన్. ఈ సినిమా నుండి రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ అమాంతం పెంచాయనే చెప్పాలి.
కాగా నిన్న రాత్రి అటు ఓవర్సీస్ తో పాటు ఇటు నైజాంలో స్పెషల్ ప్రీమియర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది మిరాయ్. సినిమా ఎలా ఉందంటే.. . మిరాయ్ ప్రపంచాన్ని పరిచయం చేస్తూ సూపర్ గా స్టార్ట్ అవుతుంది. పాత్రల పరిచయం తర్వాత హైదరాబాద్ సెటప్ తో పాటు కామెడీ ట్రాక్ అంతగా మెప్పించదు, మధ్యలో కథనం స్లో అవుతుంది. కానీ ప్రీ-ఇంటర్వెల్ లో సినిమా ఓకే హై స్టార్ట్ అందుకుని అదరగొట్టే ఇంటర్వెల్ తో రిఫ్రెషింగ్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది. ఇక సాలీడ్ గా స్టార్ట్ అయిన సెకండాఫ్ కొద్ది సేపటి తర్వాత చాలా స్లో గా సాగుతుంది. స్క్రీన్ ప్లే కొంత గజిబిజిగా అనిపిస్తుంది. కానీ ప్రీ క్లైమాక్స్ కు ముందు నుండి ఉపందుకుని అద్భుతమైన క్లైమాక్స్ ను పీక్ సినిమాటిక్ ఫీల్ ఇస్తుంది. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది టెక్నికల్ టీమ్.ఓక నార్మల్ సన్నివేసాన్ని కూడా సాలిడ్ బీజీఎమ్ తో గౌర హరి మ్యాజిక్ చేసాడు. విజువల్ గా ఈ సినిమా అద్బుతంగా ఉంది. తేజ సజ్జా యోదుడుగా సూపర్ గా చేసాడు. ఇక మంచు మనోజ్ అదరగొట్టాడు. కార్తీక్ ఘట్టమనెని ఒక మంచి విజువల్ వండర్ ని అందించాడనే చెప్పాలి.
