Site icon NTV Telugu

Mirai : తగ్గిన మిరాయ్‌ టికెట్‌ ధరలు..!

Mirai

Mirai

Mirai : యంగ్ హీరో తేజసజ్జా హీరోగా వచ్చిన మిరాయ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 12న రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పటికే రూ.150 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. అయితే తాజాగా మూవీ టీమ్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. మూవీ టికెట్ రేట్లను మరింత తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లోని సింగిల్ స్క్రీన్స్‌లో బాల్కనీ టికెట్ ధరను రూ.150గా, ఫస్ట్ క్లాస్‌ను రూ.105గా డిసైడ్ చేశారు. దసరా కానుకగా ఈ రేట్లను తగ్గిస్తున్నట్టు తెలిపారు. అయితే ఈ సినిమా టికెట్ రేట్లను మొదటి నుంచి పెంచలేదు. పెద్ద బడ్జెట్ సినిమా టికెట్ రేట్లను పెంచుతూ ప్రభుత్వాలు జీవో ఇస్తున్న సంగతి తెలిసిందే.

Read Also : Mohan Babu : మోహన్ బాబుకు గొప్ప ఛాన్స్.. ఇక మామూలుగా ఉండదా..?

కానీ మిరాయ్ సినిమాకు టికెట్ రేట్లను పెంచబోమని తేజసజ్జా రిలీజ్ కు ముందే తెలిపాడు. ఈ సినిమాను తక్కువ ధరలకే అందరికీ చూపించాలనే ఉద్దేశంతోనే ఇలా చేశామన్నాడు. అది మూవీకి పాజిటివ్ వైబ్ తీసుకొచ్చింది. ఎందుకంటే అన్ని సినిమాల రేట్లు పెంచుతున్న టైమ్ లో మిరాయ్ నిర్ణయం ప్రేక్షకుల్లో మంచి ఇంప్రెస్ ను కొట్టేసింది. అందుకే ప్రేక్షకులు ఈ సినిమాను థియేటర్లలోనే చూడాలనే ఉద్దేశంతో థియేటర్లకు వెళ్తున్నారు. మొన్న ఓజీ సినిమా రిలీజ్ రోజున మిరాయ్ థియేటర్లను ఓజీకి ఇచ్చేశారు. ఇప్పుడు మళ్లీ మిరాయ్ థియేటర్లలో ఆడుతోంది. తాజాగా మరింత ధరలు తగ్గడంతో కలెక్షన్లు మళ్లీ ఊపందుకునే ఛాన్స్ ఉంది.

Read Also : Manchu Manoj : నా వల్లే ఎన్టీఆర్ కు గాయం అయింది.. మనోజ్ కామెంట్స్

Exit mobile version