Mike Tyson: ఫ్లైట్ లో ప్రయాణికుడి ముఖం పగలగొట్టిన మైక్ టైసన్.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇక ఇటీవల విజయ్ దేవరకొండ, పూరి కాంబోలో తెరకెక్కుతున్న లైగర్ సినిమాలో నటిస్తూ మరింత ఫేమస్ అయ్యాడు. తాజాగా ఈ బాక్సింగ్ లెజెండ్ విమానంలో తోటి ప్రయాణికుడిపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఒక వ్యక్తి.. విమానంలో మైక్ టైసన్ ను చూసి అత్యుత్సాహ పడి.. అతనిని తన కెమెరాలో బంధించాడు. అంతేకాకుండా మైక్ సీట్ వెనుక నిలబడి వీడియో తీస్తూ మైక్.. మైక్ అని అరవడం మొదలుపెట్టాడు.
పలుమార్లు ఆ యువకుడిని మాట్లాడింది చాలు.. నిశబ్దంగా కూర్చొమని మైక్ చెప్పినా వినకుండా సదురు వ్యక్తి ఇంకా మైక్ ను ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. దీంతో కోపంతో ఊగిపోయిన టైసన్.. అతగాడిపై పిడిగుద్దులు కురిపించాడు. దీంతో ఆ వ్యక్తి ముఖం పగిలింది. ఈ ఘటనను కొందరు ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. మైక్ టైసన్ కి కోపం తెప్పిస్తే ఇలాగే ఉంటుంది మరి.. మైక్ టైసన్ కి చిరాకు తెప్పించే ప్రాంక్ చేసాడేమో.. అది కాస్త రివర్స్ అయ్యింది అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
Also Read
- Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్... హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
- Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
Mike Tyson appears to beat up some fan that pissed him off while on a plane.
check us out https://t.co/y8GocwtdCH
— Fight Scout (@FightScoutApp) April 21, 2022
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..