Michael Biopic OTT: రూ.10 వేల కోట్ల సంచలనం.. ఇప్పుడు ఫ్రీగా ఓటీటీలోకి ‘మైఖేల్’ బయోపిక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Michael Biopic OTT: మైఖేల్ జాక్సన్ మరణించి దాదాపు రెండు దశాబ్దాలు గడిచినా, ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో తన స్థానం పదిలంగా నిలుపుకున్నారు. ప్రపంచ పాప్ సంగీతానికి కొత్త నిర్వచనం ఇచ్చిన మైఖేల్ జాక్సన్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ‘మైఖేల్’ బయోపిక్ 2026 ఏప్రిల్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రంలో మైఖేల్ పాత్రను ఆయన సొంత మేనల్లుడు జాఫర్ జాక్సన్ పోషించడం సినిమాపై ప్రత్యేక ఆసక్తిని పెంచింది. అతని రూపం, హావభావాలు, డ్యాన్స్ శైలి, స్టేజ్ ప్రెజెన్స్ మైఖేల్‌ను మరోసారి తెరపై చూసిన అనుభూతిని ప్రేక్షకులకు కలిగించాయని అభిమానులు ప్రశంసించారు. మూన్‌వాక్‌తో ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఈ పాప్ దిగ్గజం జీవితం ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను భావోద్వేగాలకు గురిచేస్తోంది. థియేటర్లలో భారీ విజయాన్ని నమోదు చేసి బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టిన ‘మైఖేల్’ బయోపిక్ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది.
ఎక్కడ చూడచ్చు అంటే?
థియేటర్ల ప్రదర్శన తర్వాత గత జూన్ 9 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీ, బుక్ మై షో వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ఈ సినిమా రెంటల్ విధానంలో అందుబాటులోకి వచ్చింది. అయితే ఇప్పుడు ప్రముఖ స్ట్రీమింగ్ వేదిక డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఆగస్ట్ 29 నుంచి ఈ మూవీ హాట్‌స్టార్‌లో ఇంగ్లీష్‌తో పాటు హిందీ భాషలో కూడా స్ట్రీమింగ్ కానుంది. అదనపు ఛార్జీలు చెల్లించకుండా సబ్ స్క్రిప్షన్ ఉంటే ఈ మూవీని ఇంట్లోనే ఎంచక్కా చూసేయచ్చు.
Also Read
- Ramayana: ట్రైలర్‌కు ముందే 'పుష్ప' రికార్డ్ బద్దలు.. 'రామాయణం' మ్యూజిక్ రైట్స్‌కు రూ.75 కోట్ల డీల్!
- Sharwanand: ‘భోగి’ రఫ్ కట్కు శర్వానంద్ ఫుల్ సాటిస్ఫై.. సంపత్ నందికి మరో సినిమా గ్రీన్ సిగ్నల్
- Pavala Shyamala: శ్యామల ఎలా 'పావలా శ్యామల' అయ్యారు? చాలా మందికి తెలియని నిజం!
- Tollywood: వరుస గాయాలతో రెస్ట్ మోడ్ లోకి టాలీవుడ్ హీరోలు!
వసూళ్లలో రికార్డులు
థియేటర్లలో విడుదలైన వెంటనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన స్పందన అందుకుంది. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.10,000 కోట్ల వసూళ్లు సాధించి, ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్ డాలర్ల మార్క్‌ను దాటిన తొలి హాలీవుడ్ బయోపిక్‌గా చరిత్ర సృష్టించింది. భారతదేశంలో కూడా ఈ మూవీకి మంచి ఆదరణ లభించింది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.54 కోట్లకు పైగా వసూళ్లు నమోదు చేసి, హాలీవుడ్ బయోపిక్‌లలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది.
కథ
ఇందులో మైఖేల్ జాక్సన్ చిన్ననాటి నుంచి ప్రపంచ సంగీత సామ్రాజ్యాన్ని ఏలిన స్టార్‌గా ఎదిగిన ప్రయాణాన్ని భావోద్వేగంగా చూపించారు. అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలోని గ్యారీ పట్టణంలో జన్మించిచారు మైఖేల్. తన సోదరులతో కలిసి ‘జాక్సన్ 5’ బ్యాండ్ ద్వారా సంగీత ప్రపంచంలో అడుగుపెట్టాడు. చిన్న వయసులోనే తండ్రి జోసెఫ్ జాక్సన్ కఠిన వైఖరిని ఎదుర్కొన్న మైఖేల్ జీవితంలో ఎదురైన మానసిక వేదనలు, ఒంటరితనం, ప్రపంచ ఖ్యాతి వెనుక దాగిన బాధలను సినిమా హార్ట్ టచింగ్ గా చూపిస్తుంది.
ముఖ్యంగా ఆయన నిర్మించుకున్న నెవర్‌ల్యాండ్ వెనుక ఉన్న భావోద్వేగం, కోల్పోయిన బాల్యాన్ని తిరిగి పొందాలనే తపన, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సంపాదించినప్పటికీ వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న సంఘర్షణలను ఈ బయోపిక్ కళ్ళకు కట్టినట్లు చూపించింది. థియేటర్లలో ఈ సినిమా మిస్ అయినవారికి ఇది మంచి అవకాశం. సంగీతాన్ని ప్రేమించే వారైనా, మైఖేల్ జాక్సన్ అభిమానులైనా, ఒక గొప్ప కళాకారుడి జీవితం తెలుసుకోవాలనుకునే వారైనా జియో హాట్‌స్టార్‌లో ఈ బయోపిక్‌ను ఆస్వాదించవచ్చు.
తాజావార్తలు
-
Michael Biopic OTT: రూ.10 వేల కోట్ల సంచలనం.. ఇప్పుడు ఫ్రీగా ఓటీటీలోకి ‘మైఖేల్’ బయోపిక్!
-
Womens Shave Heads: విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్.. డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు.. చివరలో ఊహించని ట్విస్ట్!
-
Anantapur GGH: ఆస్పత్రి బిల్డింగ్ పైనుంచి పసికందును పడేసిన నానమ్మ.. శిశువు కాపాడిన వాటర్ బాటిల్!
-
200MP డ్యూయల్ కెమెరాలు, ARRI సినిమా టెక్నాలజీతో రానున్న HONOR Robot Phone..!
-
Commonwealth Games 2026: గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో భారత జోరు.. 12కు చేరిన పతకాల సంఖ్య
ట్రెండింగ్
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్‌తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్‌కు మరకలా..? ఈ ట్రిక్‌తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!