Megastar’s next film Remake or not: బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య అనే సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాదు కుర్ర హీరోలకు కూడా తన స్టామినా ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతానికి ఆయన తనకు మేనల్లుడు వరసయ్యే దర్శకుడు మెహర్ రమేష్ డైరెక్షన్లో భోళా శంకర్ అనే సినిమా చేస్తున్నాడు. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన వేదాళం అనే సినిమాని తెలుగు నేటివిటీకి తగినట్టుగా మార్పులు చేర్పులు చేర్చి తెరకెక్కిస్తున్నారు. వెస్ట్ బెంగాల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతానికి హైదరాబాదులో మూసాపేట ప్రాంతంలో వేసిన ఒక సెట్లో మెగాస్టార్ చిరంజీవి షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇక ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా తర్వాత వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉండగా ఆ సినిమా పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయన ఒక సినిమా డైరెక్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు.
Ram Marriage: రామ్ పెళ్లి వార్త పుకారే.. అసలు విషయం చెప్పిన స్రవంతి రవికిషోర్!
ఆ సినిమా షూటింగ్ జూలైలో మొదలుపెట్టి వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన బ్రో డాడీ సినిమాకి రీమేక్ అని ప్రచారం మొదలైంది. గతంలో బ్రో డాడీ సినిమా మెగాస్టార్ కి నచ్చడంతో దాన్ని రీమేక్ చేయడానికి ఆసక్తి చూపించిన క్రమంలో అందరూ అది నిజమే అని భావించారు. అయితే టాలీవుడ్ వర్గాల సమాచారం మేరకు అది నిజం కాదని తెలుస్తోంది. మెగాస్టార్ కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఒరిజినల్ అని బెజవాడ ప్రసన్న కుమార్ కథ అందించగా దాన్ని కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేయబోతున్నాడని తెలుస్తోంది. ఇదే కథలా అనిపించే మరొక స్టోరీ కూడా సిద్ధమవుతుండగా ఆ రైటర్ ని కూడా పిలిచి ఆ కథ వదిలేసేందుకు తగిన పారితోషికం కూడా చిరంజీవి ఇచ్చారు. ఇక ఈ సినిమా రీమేక్ సినిమా కాకపోయినా చిరంజీవి- త్రిష, సిద్దు జొన్నలగడ్డ -శ్రీ లీల జంటలుగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాని చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల తన గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నిర్మించే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.