Site icon NTV Telugu

Acharya: మెగా అభిమానులారా సిద్దంకండి.. బాస్ వస్తున్నాడు

Acharya

Acharya

మెగాస్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆచార్య. కొణిదెల ప్రొడక్షన్స్ పై సురేఖ కొణిదెల నిర్మిస్తున్న ఏ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తుండగా.. చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు ఏప్రిల్ 28 న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ ను మేకర్స్ వేగవంతం చేశారు. ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా ట్రైలర్ ను ఏప్రిల్ 12 న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సెలెక్ట్ చేసిన థియేటర్లలో ఈ ట్రైలర్ రిలీజ్ కానుంది. దీంతో మెగా అభిమానులు ట్రైలర్ కోసం థియేటర్ల వద్ద సందడి చేయడానికి షురూ అయిపోయారు. ఇంకొద్ది గంటల్లో మెగా మాస్ ట్రీట్ అంటూ మేకర్స్ మరో అప్డేట్ ని ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో ఏఏ థియేటర్లలో ట్రైలర్ రిలీజ్ కానుందో థియేటర్స్ లిస్ట్ ని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలను కలిపి మొత్తం 152 థియేటర్లో ఆచార్య ట్రైలర్ రిలిజ్ కానుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మెగా అభిమానులు సిద్దంకండి రేపు ఆచార్య తో బాస్ వస్తున్నాడు.. సందడి షురూ చేయండి అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version